మసాలా
 
 
 
 
అమెరికాలో ఏంజిలీనా జోలి విగ్రహం
హాలీవుడ్‌ నటీమణుల స్టైలే వేరు. వారంతా కొత్త, కొత్త హాబీలతో అందరి దృష్టిని ఆకర్షిస్తారు. సినిమాల్లో వారు చక్కటి గ్లామర్‌, నటనతో అందరినీ మురిపిస్తారు. బయట ప్రపంచంలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ పాపులారిటీ సంపాదిస్తారు. ఇటువంటి హాలీవుడ్‌ నటీమణి ఏంజిలీనా ఆమె పాపులారిటీ ఎంతటిది అంటే ఏకంగా ఏంజెలీనా విగ్రహాన్ని అమెరికాలో ప్రతిష్టించారు అభిమానులు. అయితే నటీమణుల విగ్రహాలను ప్రతిష్టించడం మాత్రం అమెరికాలో కొత్త ప్రయోగంగా చెప్పుకోవచ్చు. మన దేశంలో అయితే కేవలం తమిళ సినిమా పరిశ్రమలో మాత్రం కొంతమంది హీరోలకు,హరోయిన్లకు గుళ్లు కట్టిన సందర్భాలు ఉన్నాయి. టాలీవుడ్‌, బాలీవుడ్‌లో అలాంటి సందర్భాలు లేవనే చెప్పాలి. అయితే హాలీవుడ్‌లో మాత్రం ఇప్పుడిప్పుడే ఒక కొత్త ట్రెండ్‌ మొదలైంది. అది కూడా నటీమణుల విగ్రహాలు పెట్టడం. అమెరికాలో మొదట ప్రతిష్టించే విగ్రహం ప్రముఖ మోడల్‌, హాలీవుడ్‌ నటీమణి ఏంజిలీనా జోలి ది కావడం విశేషం.

అమెరికాలోని ఓక్లహోమా సిటీలో ఏంజిలీనా నిలువెత్తు విగ్రహం ప్రతిష్టించారు. కంచుతో తయారు చేస్తోన్న ఏంజిలీనా విగ్రహం శిశువుకు పాలిస్తున్నట్లుగా ఉంది. ఈ విగ్రహన్ని మలిచిన డానియల్‌ ఎడ్వా మాట్లాడుతూ ‘శిశువుకు పాలిస్తున్నట్లుగా తీర్చిదిద్దిన ఏంజిలీనా విగ్రహం తల్లుల్లో చైతన్యం తీసుకువస్తుంది’ అని చెప్పాడు. ముఖ్యంగా చంటిపిల్లలకు తల్లి పాలు ఎంత ముఖ్యమో ఈ విగ్రహం తెలియజేస్తుందని ఆయన అంటున్నారు. కాగా ఏంజిలీనా తన ఇద్దరు కవల పిల్లలకు పాలిస్తున్నపుడు జోలి బాయ్‌ఫ్రెండ్‌ బ్రాడ్‌పిట్‌ ఫోటోలు తీశాడట. ఈ ఫోటో ఆధారంగానే ఈ విగ్రహాన్ని మలుస్తున్నారట. హాలీవుడ్‌లో ఇది ఓ కొత్త ట్రెండ్ కి నాంది పలికింది .