మసాలా
 
 
 
 
ఇకఫై ఇబ్బంది పడనంటున్న అనుష్క
‘‘సినిమా అనేది నా జీవితంలో ఓ భాగం మాత్రమే. అంతేకానీ జీవితమే సినిమా కాదు’’ అంటున్నారు అనుష్క. రీల్ లైఫ్ కారణంగా రియల్ లైఫ్‌లోని మాధుర్యాన్ని పూర్తిగా అనుభవించలేకపోతున్నానని ఈ ముద్దుగుమ్మ ఆవేదన వ్యక్తపరిచారు. ఇంకా ఆమె మాట్లాడుతూ- ‘‘కథానాయికగా ఈ స్టేజ్‌కి రాగలగడం సాధారణమైన విషయం కాదు. కృషితో పాటు అదృష్టం కూడా కలిసొస్తేనే ఈ రేంజ్‌కి రాగలం. ఇలాంటి గొప్ప స్థానంలో ఉన్నందుకు ఆనందపడాలో... లేక పర్సనల్ లైఫ్ డిస్ట్రబ్ అవుతోందని బాధ పడాలో... అర్థం కావడంలేదు. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలంటారు.

కానీ పర్సనల్ లైఫ్‌ని వదులుకోలేం కదా? రెండిటినీ సమానంగా డివైడ్ చేద్దామంటే అది కుదరని పని అయిపోయింది’’ అన్నారు అనుష్క. ‘‘ఇంటికి రాగానే ఇంట్లో కూడా షూటింగ్‌ల గురించే మాట్లాడుకోవడం ఈ మధ్య ఎక్కువై పోయింది. అందుకే ఇంట్లో సినిమా గోల వినపడకుండా జాగ్రత్త పడుతున్నాను. ఇంటి విషయాలలో మునిగిపోవడానికి ట్రై చేస్తున్నాను. నా పరిస్థితిని మా వాళ్లు కూడా అర్థం చేసుకున్నారు. అందుకే వారు కూడా నాకు తగ్గట్టుగా నడుచుకుంటున్నారు’’ అని చెప్పారు అనుష్క.

ఇంకా అనుష్క మాట్లాడుతూ-‘‘ఈ మధ్య ‘వానమ్’ షూటింగ్‌కు నా ఫ్యామిలీ మెంబర్స్‌ను కూడా తీసుకెళ్లాను.వారి ముందు కొన్ని సన్నివేశాల్లో నటించడానికి చాలా ఇబ్బంది పడ్డాను. అందుకే ఇక నుంచి లొకేషన్లోకి మా వాళ్లని తీసుకెళ్ళకూడదని నిశ్చయించుకున్నాను’’ అని చెప్పారు. తెలుగు, తమిళ భాషల్లో గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూ దక్షిణాదిన ఆగ్రనాయికగా భాసిల్లుతున్న అనుష్క. ఇటీవల ‘తీన్‌మార్’ ఇచ్చిన పవన్‌కళ్యాణ్‌తో కూడా ఓ సినిమా చేస్తున్నారు. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో జీసస్ క్రైస్ట్ జీవిత కథ ఆధారంగా కొండా కృష్ణంరాజు నిర్మిస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రంలో పవర్‌స్టార్‌కు జోడీగా అనుష్క నటింస్తున్నారు. వీరిద్దరి కలయికలో వస్తున్న తొలి సినిమా ఇదే కావడం గమనార్హం.