Bookmark and Share   Cinevinodam
Subscribe
 
 
అప్పలరాజు పాట ‘అదుర్స్’

     రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో రానున్న ‘‘కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : అప్పలరాజు’’ చిత్రంలో దర్శకుల మీద వేసిన సెటైర్ పాట సంచలనం సృష్టిస్తున్న సందర్భంగా ఆ పాట మీకోసం...

పల్లవి :
లక్కుతో ‘శివ’ సినిమా తీసి,
‘షోలే’ని చెడగొట్టి, పిచ్చవాగుడు
వాగేవాడు... డైరెక్టరా వర్మా..,
హిచ్ కాక్ సినిమాలు చూసి...
దెయ్యాల సినిమాలు తీసే
రాంగోపాల్ వర్మా... డైరెక్టరా ఖర్మా!
అబ్బ సొత్తు కాదురా టాలెంటూ...
ఎవడబ్బ సొత్తుకాదురా టాలెంటూ... "2"

చరణం 1 :
మణిరత్నం, శకంర్ లు ఏమన్నా పుడింగులా..
వినాయక్ లు, వంశీలు పై నుంచే ఊడారా...
రాఘవేంద్రరావేమన్నా పాలు, పళ్ళు,
బొడ్డూ తప్ప గొప్ప సినిమా తీశాడా?
అబ్బ సొత్తు కాదురా టాలెంటూ...
ఎవడబ్బ సొత్తుకాదురా టాలెంటూ... "2"

చరణం 2 :
సమాజాన్ని ఉద్ధరిస్త నేననీ... సమూలంగా
మార్చివేస్తాననీ, కృష్ణవంశీ తీత్తాడు సినిమాలు,
అర్థం అసలుకాక చత్తారు ప్రేక్షకులు
లాటరీలో ‘పోకిరి’ హిట్టనీ, తెలియక
పూరీజగనూ... దేశముదురును అంటాడు ఏం చేయను...
మరిచాడా తన తీసిన ఆంధ్రావాలను...
చూశాంలే రాజమౌళి మగధీరను...
తీస్తాన్లే తలదన్నే సినిమాను "2"

ఏం పాపాల్ చేశామనీ...
అయ్యో!ఏం పాపాల్ చేశామనీ...
ఏం పాపాల్ చేశామనీ బీ.గోపాలూ...
అదే పనిగా పేలుస్తాడు టాటాసుమోలు...

పల్లవి :
అందుకనే వస్తుంది అప్పల్రాజు,
డైరెక్టర్లకు చేస్తాడు ఫుల్ మసాజూ! "2"
అబ్బ సొత్తు కాదురా టాలెంటూ...
ఎవడబ్బ సొత్తుకాదురా టాలెంటూ... "2"

చరణం 3 :
పిల్లిలాంటి బోయపాటి శ్రీనుకి,
‘సింహ’గర్జన అవసరమా ట్రాజెడీ...
‘నమో వెంకటేశ’ అన్న శ్రీను వైట్లకి,
పంగనామమే మిగిలే చివరికి...
బొమ్మాళీ నిన్నొదలా అని కోడీ...
అనుష్కతో తీసిండు అరుంధతీ...
పాత సినిమ స్టోరీలను కాపీకొట్టి,
పెద్దటోపీ పెట్టాడు తలకు కట్టెట్టి...
ఇవివి, ఎస్వీల సెంటిమెంట్లూ...
తలనొప్పికి కనిపెట్టని ఆయింట్ మెంట్లు "2"
గుణశేఖర్ వేయించే...
గుణశేఖర్ వేయించే...
గుణశేఖర్ వేయించే లక్షల సెట్లూ,
ప్రొడ్యూసర్ పాలిటవి సర్పపుపాట్లు.

పల్లవి :
అందుకనే వస్తుంది అప్పల్రాజు,
డైరెక్టర్లకు చేస్తాడు ఫుల్ మసాజూ! "2"
అబ్బ సొత్తు కాదురా టాలెంటూ...
ఎవడబ్బ సొత్తుకాదురా టాలెంటూ... "2"

 
 

Copy right reserved for www.cinevinodam.com 2005