Bookmark and Share   Cinevinodam
Subscribe
 
 
ఆ సీన్ మారింది...

     సినిమా రంగంలో తారాపథం అందుకోవడం, తిరిగి జారిపోవడం చాలా విచిత్రంగా జరుగుతుంటుంది. ఒక సినిమా జయాపజయాలు ఆ ఆర్టిస్ట్ తలరాతనే మార్చేస్తుంటుంది. దక్షిణాది నుండి ఉత్తరాదికి వెళ్ళి ‘గజని’తో ఘన విజయం స్వంతం చేసుకున్న అసిన్ పరిస్థితి కూడా ఇప్పుడు అలానే తయారయ్యింది. ‘గజని’ విజయం తర్వాత అసిన్ కు లెక్కలేనన్ని అవకాశాలు వెదుక్కుంటూ వచ్చాయి. అయితే, విజయపథంలో ఒక్కో మెట్టే ఎక్కాలి తప్ప, తొందర పడకూడదంటూ ఆమె వచ్చిన అవకాశాలన్నింటినీ పక్కన పెట్టి, సల్మాన్ ఖాన్ తో ‘లండన్ డ్రీమ్స్’ ఒక్కటే చేసింది. ఆ చిత్రం పూర్తయ్యాక తన పాత్ర పట్ల, పబ్లిసిటీలో తనను తగ్గించి చూపడం పట్ల అసంతృప్తితో వున్న అసిన్ ను ఆ చిత్ర పరాజయం మరింత ఇబ్బందులపాలు చేసింది.

అసిన్ తండ్రి జోసెఫ్ వ్యవహారం బాలీవుడ్లో న్యూసెన్స్ గా చెప్పుకోవడం తెలిసిందే. దాంతో ఈ మధ్యనే బాలీవుడ్ సంస్కృతికి అనుగుణంగా అసిన్ కూడా రెండిళ్ళ పద్ధతికి తెరతీసింది. ఆ మధ్య ప్రియాంక చోప్రా కూడా ఇలానే చేసింది. ఒక ఇల్లు కుటుంబానికి, ఒక ఇల్లు సినిమా వ్యవహారాలకీ అట. అయినా ‘లండన్ డ్రీమ్స్’ ప్లాప్ కావడంతో సహజంగానే దర్శక నిర్మాతలు ఆమెను పట్టించుకోవడం మానేశారు. కేవలం షారుక్ ఖాన్ తో చేసే ఓ సినిమాలోనే అవకాశం వుంటుందనే ఆశతో ఆమె వుంది. ఇక మిగిలిందల్లా పాత మిత్రులు దక్షిణాదివారే. ఆ మధ్య ఎన్నో మంచి ఆఫర్లు ఇచ్చినా తిరస్కరించిన అసిన్ ఇప్పుడు- ‘‘దక్షిణాది చిత్రాలు చేయనని నేనెప్పుడూ అనలేదు. మంచి పాత్రయితే చేయడానికి నేనెప్పుడూ సిద్ధం’’ అంటూ ఓ ప్రేమ ప్రకటన చేసింది. విజయ్ హీరోగా చేస్తున్న ఓ చిత్రంలో ఆమె సైన్ చేయడానికి సిద్ధంగా వుందని తెలుస్తోంది.

 
 

Copy right reserved for www.cinevinodam.com 2005