'గజిని' తర్వాత నేనెంతో థ్రిల్‌కి గురై చేసిన సినిమా 'లండన్ డ్రీమ్స్'. హిందీలో మొదటి అవకాశమే అమీర్ ఖాన్ పక్కన కొట్టేశాను. రెండో సినిమాలో మరో క్రేజీ
హీరో సల్మాన్ ఖాన్ పక్కన నటించాను. 'లండన్ డ్రీమ్స్'లో వర్క్ చేసేటప్పుడు చాలా సరదాగా చేశాను. ఆ సినిమా నాకు మంచి అనుభూతినిచ్చింది. కానీ
సినిమా ప్రేక్షకులకు ఆ అనుభూతిని కలగజేయలేకపోయినందుకు షాక్ అయ్యాను.
'లండన్ డ్రీమ్స్' ఫెయిలవ్వడంతో నేను ఆచితూచి సినిమాలు ఒప్పుకుంటున్నాను అనే టాక్ ఉంది. ఆ సినిమాలో నటించినందుకు నేను
పశ్చాత్తాపపడటంలేదు. అంత పెద్ద సినిమాలో సోలో హీరోయిన్‌గా నటించే అవకాశం రావడం గొప్ప విషయం. ఆ దిశగా ఆలోచిస్తే మొదటి సినిమాలో అమీర్
పక్కన సోలో హీరోయిన్‌గా, రెండో సినిమాలో సల్మాన్, అజయ్ దేవగన్‌లాంటి స్టార్స్ కాంబినేషన్‌లో నటించినందుకు ఆనందంగా ఉంది.
ఏ సినిమా పడితే అది చేసేసి బాలీవుడ్‌కి వెళ్లినంత వేగంగా వెనక్కి రావాలని ఎవరూ అనుకోరు.
అశుతోష్ గోవర్కర్ రూపొందిస్తున్న 'ఖేలేన్ హమ్ జీ జాన్ సే' చిత్రంలో నా పాత్ర నిడివి తక్కువగా ఉండటం వల్ల నేను ఒప్పుకోలేదనే వార్త ఉంది. ఆ వార్తలో
ఏమాత్రం నిజం లేదు. ఆ సినిమా ఒప్పుకున్నాను. అయితే చివరి నిముషంలో డేట్స్‌పరంగా ఏర్పడిన కన్‌ఫ్యూజన్ వల్ల తప్పుకోవాల్సి వచ్చింది.
ఇద్దరు తారల మధ్య స్నేహం ఉండదని చాలామంది అంటుంటారు. కానీ ఆ మాటల్లో నిజం లేదు. బాలీవుడ్‌కి వెళ్లిన తర్వాత నాకు శ్రీదేవి కుటుంబం ఎంతో
దగ్గరైంది. దక్షిణాదిన ఓ వెలుగు వెలిగి ఉత్తరాదిన కూడా అదే స్థాయిలో పేరు తెచ్చుకున్న శ్రీదేవి ఏమాత్రం భేషజం లేకుండా నాతో కలిసిపోయారు. అలాగే
దీపికా పదుకొనే, నేనూ మంచి స్నేహితులం. ఈ మధ్య అనుష్క శర్మ కూడా స్నేహితురాలైంది. గత ఏడాది ఓ కార్యక్రమానికి సుస్మితా సేన్‌తో కలిసి న్యాయ
నిర్ణేతగా వ్యవహరించాను. అప్పట్నుంచి ఆమెతో చనువు పెరిగింది.
బాలీవుడ్‌లో ప్రతిభ గల తారలు, అందగత్తెలు చాలామంది ఉన్నారు కాబట్టి నేను అభద్రతాభావానికి గురవుతున్నానన్నది చాలామంది ఫీలింగ్. నా ప్రతిభ
మీద నాకు అపారమైన నమ్మకం ఉంది. అందుకని అభద్రతాభావానికి గురయ్యే ప్రసక్తే లేదు.
బాలీవుడ్‌కి వెళ్లి రెండేళ్లవుతోంది. ఇప్పుడిప్పుడే అక్కడి వాతావరణం అలవాటుపడుతోంది. అందుకని సలహాల కోసం అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్‌ని
ఆశ్రయిస్తుంటాను. ఇక బాలీవుడ్‌లో మరో సూపర్‌స్టార్ అయిన షారుక్ ఖాన్‌తో కలిసి నటించే అవకాశం వస్తే నాకంత కన్నా ఆనందం మరోటి ఉండదు.
దక్షిణాది కెరీర్‌కి ఫుల్‌స్టాప్ పెట్టలేదు. అక్కడ మంచి సినిమాలు చేశాను. మళ్లీ సౌత్‌లో సినిమాలు చేస్తే నాకు మరింత మంచి పేరు వచ్చే విధంగా ఉండాలి.
దానికి ఆస్కారం ఉన్న కథలు వస్తే తప్పకుండా చేస్తాను. హిందీలో కూడా అభినయానికి ఆస్కారం ఉన్న ప్రాతలకే ప్రాధాన్యం ఇస్తున్నాను.
|