Bookmark and Share   Cinevinodam
Subscribe
 
 
‘అవతార్’కు గోల్డెన్ గ్లోబ్

     బాక్స్ ఆఫీసునుషేక్ చేస్తున్న జేమ్స్ కామెరూన్ సైంటిఫిక్ చిత్రం ’అవతార్‘ గోల్డెన్ గ్లోబ్ ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు అవార్డులను ఎగరేసుకుపోయింది. కామెరూన్ ఆల్ టైమ్ హిట్ ’టైటానిక్‘ తర్వాత అంతటి కలెక్షన్ల వరద పారిస్తున్న ’అవతార్‘... ’ది హార్డ్ లాకర్‘, ’ఇంగ్లోరియస్ బాస్టడ్స్‘, ‘ప్రీషియస్’ ‘అప్ ఇన్ ది ఎయిర్’ చిత్రాలను త్రోసిరాజని బెస్ట్ మోషన్ పిక్చర్ - డ్రామా అవార్డును గెలుచుకుంది. లాస్ ఏంజిల్స్ లో జరిగిన ఓ కార్యక్రమంలో 67వ గోల్డెన్ గ్లోబ్ అవార్డులను ప్రకటించి అందజేశారు. కామెరూన్ తన మాజీ భార్య కత్రీన్ బైగోలో (ది హర్ట్ లాకర్)ను వెనక్కినెట్టి ఉత్తమ దర్శకుడి అవార్డును దక్కించుకోవడం విశేషం. క్లింట్ ఎస్ట్ వుడ్ (ఇన్ విక్టస్), జాసోన్ రీట్మేన్ (అప్ ఇన్ ద ఎయిర్), క్వీన్ టిన్ టారాంటినో (ఇంగ్లోరియస్ బాస్టడ్స్)లు ఉత్తమ దర్శకుడి అవార్డు కోసం పోటీపడ్డారు. కామెరూన్ మాట్లాడుతూ- ఇరాక్ యుద్ధం ఇతివృత్తంతో సినిమా తీసిన తన మాజీ భార్యకు అవార్డు వస్తుందని భావించానని చెప్పారు. ‘నిజంగా నేనిది ఊహించలేదు. కత్రీన్ కే అవార్డు వస్తుందని అనుకున్నా. ఏదేమైనా నాకు చాలా సంతోషంగావుంది’ అని ఆయన అన్నారు. 1997లో టైటానిక్ చిత్రానికి కామెరూన్ తొలి గ్లోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్నారు. ఆయనకిది రెండో గోల్దెన్ గ్లోబ్. కాగా క్రేజీ హార్ట్ చిత్రంలో గాయపడి పాత్ర పోషించి అలరించిన జెఫ్ బ్రిడ్జెస్ ఉత్తమ నటుడి అవార్డును సొంతం చేసుకున్నాడు. ‘ది బ్లైండ్ సైడ్’ సినిమాలో అద్భుత నటనకు గానూ శాండ్రా బులక్ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్నారు. జర్మన్ చిత్రం ‘ది వైట్ రిబ్బన్’కు ఉత్తమ విదేశీ చిత్రం అవార్డు దక్కింది.

 
 

Copy right reserved for www.cinevinodam.com 2005