త్వరలో పెళ్ళికొడుకు అవుతున్న అల్లు అర్జున్ ‘బద్రీనాథ్’గా ఇండియన్ సమురాయ్ పాత్రలో ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా....
- నేను సమూరాయ్
‘బద్రీనాథ్’లో మరోసారి మాస్ పాత్రలో నటిస్తున్నా. తమన్నా కథానాయిక. వి.వి.వినాయక్ దర్శకుడు. ఓ చారిత్రక కథాంశం వున్న సినిమా అని
అనుకుంటున్నారంతా. అది నిజంకాదు. ఒకానొకప్పటి దేవాలయం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. నా రోల్ ఇండియన్ సమురాయ్. కత్తి, డాలు
గిరగిరా తిప్పుతాను, ఫైట్లు అలరిస్తాయి. బాగా వర్క్ అవుట్ అయ్యే సినిమా ిది. సమురాయ్ గా నన్ను ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారు. తుపాకుల కంటే
కత్తులు, కటారులు బాగా పనిచేస్తాయనడానికి చాలా ఉదాహరణలు వున్నాయి. టాప్-10 యాక్షన్ సినిమాలను పరిశీలిస్తే... ఆ విషయం
అర్థమవుతుంది.
- సమురాయ్ అంటే..?
సకల యుద్ధ కళల్లో ఆరితేరినవాడు అని అర్థం. పురాతన కాలంలో సమురాయ్ శిక్షణ అనేది చాలా ప్రత్యేకత వున్న అంశం. కత్తి తిప్పడం, గుర్రంపై వెళుతూ...
బాణం సంధించడం, శత్రువు దాడినుంచి మెరుపులా తప్పించుకోవడం, రెప్పపాటులో శిరస్సును మొండెం నుంచి వేరు చేయడం.... ఇలా ఎన్నో ప్రత్యేకతలున్న
విద్య అది. జపాన్(లో) పారిశ్రామికీకరణ కాకముందు పుట్టిన పదం ఇది. అక్కడ ఆర్మీ సైనికులకిచ్చే కఠోర శిక్షణను సమురాయ్ శిక్షణ అనేవారు.
- వినాయక్ తో రెండో సినిమా....
దర్శకుడు వి.వి.వినాయక్ నాకు చాలాకాలంగా తెలుసు. నా కుటుంబం సభ్యునికంటే ఎక్కువ. అతడితో సినిమాకి పనిచేయడం చాలా ఆహ్లాదం అనిపిస్తుంది.
నటీనటులకు చాలా సౌకర్యం కూడా. అంతకుమించి మంచి స్పష్టత వున్న దర్శకుడు. ‘బన్నీ’ తర్వాత వినయ్ తో చేస్తున్న రెండో సినిమా ‘బద్రీనాథ్’.
‘ఆర్య’ తర్వాత ఈ సినిమా ఆలస్యంగానే ప్రారంభమైంది. అందుకు కారణం- చిన్నికృష్ణ కథ రెడీ చేసినా, సరైన దర్శకుడు దొరకడం కష్టమైంది. వి.వి.వినాయక్
ప్రవేశంతో అన్నీ కుదిరి ప్రాజెక్ట్ సాఫీగా ముందుకు సాగుతోంది.
- మిల్క్ బ్యూటీ టాలెంటెడ్!
మిల్క్ బ్యూటీ తమన్నాతో ఇదే తొలి సినిమా. గతంలో రెండుసార్లు అవకాశం వచ్చి చేజారింది. అయితే ఇద్దరి మధ్యా పరిచయం మాత్రం ముందునుంచే వుంది.
మ్యాగజైన్ ఫొటో షూట్ లలో కలిశాం. ఏదేమైనా... లక్కీగా ఇప్పటికి కుదిరింది. తమన్నా అద్భుతమైన అంకితభావంతో పనిచేసే అమ్మాయి. మా బెస్ట్ పెయిర్
ను చూడడానికి సినిమా రిలీజ్ వరకూ కాస్తా ఆగాల్సిందే.
- కొత్త ఫైట్స్ నేర్చుకున్నా...
ఈ సినిమాలో ఫైట్స్ వెరీ స్పెషల్. అందుకోసం సెట్స్ కెళ్ళకముందే ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా. ప్రత్యేకించి నా శరీరభాషను మార్చుకున్నాను. మార్షల్ ఆర్ట్స్ కు
సంబంధించి కొత్త సంగతుల శిక్షణకు వియత్నాం వెళ్ళాను.
- చరణ్ తో కలిసి నటిస్తా...
రామ్ చరణ్- బన్నీ కాంబినేషన్లో సినిమా తెరకెక్కడానికి ఇంకా సమయముంది. మూడేళ్ళా... ఐదేళ్ళా అనేది ఇంకా చెప్పలేను. జస్ట్ ఓ ఆలోచన జరిగిందంతే.
ముందు ఓ మంచి టైటిల్ దొరికితే రిజిస్టర్ చేసి తర్వాత అన్ని సంగతులూ మొదలెడదాం. ‘చరణార్జున్’ అనే టైటిల్ కేవలం జనాల ఊహ అంతే.
- స్టార్ బ్రాండ్ చూసే థియేటర్లకొస్తారు...
ఓ సినిమా ప్లాపయితే 100శాతం బాధ్యత నాదే. విజయం సాధిస్తే మాత్రం అందరిదీ. సినిమా ఒప్పుకున్నాక కథానాయకుడికి రెండు రకాల పద్ధతులుంటాయి.
హీరోగా తన బాధ్యత పూర్తిచేసి దులిపేసుకోవడం వాటిలో ఓ పద్ధతి. ప్రాజెక్ట్ ప్రారంభం నుంచీ అన్ని సృజనాత్మకత విషయాల్లో ఓ భాగమై పూర్తి బాధ్యతతో
పనిచేయడం రెండోది. నేను రెండో రకం. సంతకం చేస్తే... పూర్తిస్థాయి బాధ్యత తీసుకుంటాను. జనాలు... స్టార్ బ్రాండ్ చూసే థియేటర్ కి వస్తారు. ఆ విలువను
కాపాడడం కోసం ఒత్తిడిని మనమే భరించాలి అనేది నా పద్ధతి.
- తెరవెనుక విభిన్నం....
తెరపై చూస్తే అర్జున్కి నిజజీవితంలో అర్జున్కి సంబంధం వుండదు. ఆఫ్ స్ర్కీన్ వ్యక్తిగతంగా చాలా విభిన్నంగా వుంటా. నాతో సన్నిహితంగా పరిశీలించేవాళ్ళకు
అదో షాక్ కలిగించే విషయం. రియల్ లైఫ్ లో హాయిగా గడిపేనే వ్యక్తిని. చలాకీతనం నా నేస్తం. వీటన్నిటికీ మించి చాలా అదృష్టవంతుడిని. కానీ తెరపై
పోషిస్తున్న పాత్రలకు తెరవెనుక వ్యక్తిగత జీవితానికి సంబంధం వుండదు. అవి నా జీవనాన్ని ప్రతిబింబించవు. నిజానికి నేను ఎక్కువగా సిటీల్లోనే పెరిగాను.
అక్కడంతా కాస్మోపోలిటన్ సంస్కృతి. నా సినిమా కథలు మాత్రం అలా వుండవు. ఇప్పటివరకు చేసినవాటిలో ఎక్కువ మాస్ పాత్రలే.
- పెద్దలు కుదిర్చారనుకోండి...
స్నేహతో ప్రేమపెళ్ళా... పెద్దలు కుదిర్చిన వివాహమా అనేది నేను చెప్పను. అది చాలా క్లిష్టతరం (నవ్వుతూ...) కూడా. ‘వెల్..., మాది పూర్తి... పెద్దలు
కుదిర్చారా.... అనేది ఆలోచించకుండా... ఎరేంజ్డ్ మేరేజ్ అనే అంతా భావించండి. అయితే... మేమిద్దరం ముందే ఒకరికొకరం తెలుసు (సిగ్గు). అంతే...’
- అమ్మాయి దగ్గర ఒగలు పోతారు....
కుర్రాళ్ళు నిజానికి బయట ఎలా వున్నా... అమ్మాయి విషయానికొస్తే చాలా సాఫ్ట్ గా, అరువుతెచ్చుకున్న స్టైల్ ని చూపిస్తూ... ప్రవర్తిస్తారు. నేనలా కాదు.
చాలా మామూలుగా... ఎప్పుడూ వున్నట్టే... లౌడ్ గానే వుంటా. నేనేదైనా ఓపెన్ గా చెబుతా...!
- కొత్త డైరీలో కొత్త అనుబంధం...
డైరీ రాయడాన్ని బాగా ప్రేమిస్తా. నిత్యం డైరీ రాయడాన్ని ఆస్వాధిస్తాను. ఇప్పటికే పదేళ్ళుగా 10డైరీలు పూర్తిచేసా. ఈ పని సాగుతూనే వుంటుంది. కొత్త
డైరీలో కొత్త బాంధవ్యంతో జీవితాన్ని అందంగా మలుచుకోవాలనుకుంటున్నా...