చిత్రసీమలో నిలదొక్కుకోవాలంటే నటనా ప్రతిభ ఒక్కటే చాలదని, తగిన మోతాదులో గ్లామర్‌ను కూడా ప్రదర్శించాలని నటి భావన కొంచెం
ఆలస్యంగా తెలుసుకున్నట్టుంది. తమిళం, తెలుగు భాషల్లో అవకాశాలు కరువు కావడంతో మాతృభాషా చిత్రాలపై దృష్టి పెట్టిన ఈ మలయాళీ
కుట్టి అక్కడ గ్లామర్ స్టార్‌గా పేరు తెచ్చుకుంటోందట. చిత్తిరం పేసుదడి చిత్రంతో కోలీవుడ్‌కు వచ్చిన ఈ అమ్మడు ఆ చిత్రంలో రౌడీ పిల్లగా
నటించి అందరి దృష్టినీ ఆకర్షించింది. ఆ తరువాత కొన్ని చిత్రాలలో నటించినా కెరీర్ ఆశాజనకంగా లేకపోవడంతో టాలీవుడ్‌లోకి ప్రవేశించింది.
అక్కడ మొదట్లో కొన్ని అవకాశాలను రాబట్టినా సక్సెస్ దరి చేరలేదు. దీంతో మళ్లీ మలయాళ చి త్రాలపై మొగ్గు చూపింది. ఈ సంద ర్భంగా ఈ
కేరళ కుట్టితో చిన్న భేటీ.
ఈసారి గ్లామర్‌నే నమ్ముకున్నట్టున్నారు?
నిజం చెప్పాలంటే నేను తమిళంలో నటించినవన్నీ హోమ్లీ పాత్రలే. పక్కింటి అమ్మాయి ఇమేజ్ తెచ్చుకున్న తన నుంచి ఇప్పుడు
మలయాళ చిత్ర పరిశ్రమ గ్లామర్‌ను కోరుకుంటోంది. అందుకే అలాంటి పాత్రలు చేయాల్సి వస్తోంది.
ఇకపై అందాలను ఆరబోయాలనే నిర్ణయించుకున్నారా?
జ : ఏ విషయంలోనయినా నాకు కంఫర్టబుల్‌గా ఉండేలా చూసుకుంటాను. అది డ్రస్ విషయంలోనైనా సరే. నాకంటూ ఒక పాలసీ ఉంది. గ్లామర్
వేరు, వల్గారిటీ వేరు. వల్గారిటీ అనిపించనంత వరకు గ్లామర్‌గా నటించడంలో తప్పులేదంటాను. కాబట్టి అభినయంతో పాటు గ్లామర్‌కు కూడా
ప్రాధాన్యతనిస్తాను.
అసల్ చిత్రం తరువాత తమిళంలో అవకాశాలు అందిపుచ్చుకోలేకపోయారే?
జ : అవకాశాలు అందిపుచ్చుకోలేదన్నది నిజం కాదు. అసల్ చిత్రం తరువాత చాలా అవకాశాలు వచ్చాయి. వాటితో నేను కన్విన్స్
కాలేకపోయాను. అయితే తమిళంలో గ్యాప్ వచ్చినా తమిళ ప్రేక్షుకులు నన్ను మరచిపోలేదు. వాళ్ల మెప్పు పొందే పాత్రల కోసమే ఎదురు
చూస్తున్నాను. తప్పకుండా మళ్లీ మంచి చిత్రంతో కోలీవుడ్‌కు వస్తాను.