Bookmark and Share   Cinevinodam
Subscribe
 
 
ఒకే లాంటి పాత్రలు చేయను

      ఒక రోజు సడెన్‌గా హీరో సుమంత్‌ వాళ్లక్క సుప్రియ 'యువకుడు' మూవీకోసం స్క్రీన్‌ టెస్ట్‌కు పిలిచింది. ఓ ట్రయిల్‌ వేద్దామనుకుని వెళ్లాను. సెలెక్ట్‌ అయ్యాను. అంతే, హీరోయిన్నయిపోయాను.

సినిమాల్లోకి వచ్చినా నాకు యాడ్‌ఫిల్మ్స్‌ అంటే ప్రత్యేక అభిమానం. ఎందుకంటే నా కెరీర్‌ని యాడ్స్‌తోనే ప్రారంభించాను. పాండ్స్‌ పౌడర్‌ క్యాంపెయిన్‌ నాకు చాలా పేరు తెచ్చిపెట్టింది. సినిమాల్లోకి రాకముందు కొన్ని హిందీ మ్యూజిక్‌ వీడియో ఆల్బమ్స్‌ కూడా చేశాను.

మొదట్లో రొమాంటిక్‌ సీన్లలో నటించటానికి చాలా ఇబ్బంది పడేదాన్ని. రన్‌ (హిందీ) సినిమాలో అభిషేక్‌ బచ్చన్‌ నాకు ఐ లవ్యూ చెప్పే సీన్‌ ఒకటుంది. అతను వచ్చి చెప్పగానే చాలా సిగ్గుపడిపోయాను. దాంతో రీటేక్‌ చేయాల్సి వచ్చింది.

'తేరే నామ్‌' సినిమా నా లైఫ్‌లో మైలు రాయి. నా పూర్తి ఎనర్జీ పెట్టి చేశాను. అందుకు తగ్గట్టుగానే ఫలితం కూడా వచ్చింది. సినిమా చాలా బాగా ఆడటంతో నేను పడిన సంతోషం అంతా ఇంతా కాదు.

ఎప్పుడూ ఒకేలాంటి పాత్రలు చేయటం ఇష్టముండదు. మిస్సమ్మ, అనసూయ సినిమాల్లోని పాత్రలే ఇందుకు ఉదాహరణ. ప్రేక్షకులు కూడా నన్ను అలాంటి చాలెంజింగ్‌ పాత్రల్లో ఇష్టపడుతున్నారు. దానికి వాళ్లకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి.

గ్లామరస్‌గా ఉండటం వరకూ ఓకే. కానీ అవకాశాలను అందిపుచ్చుకోవటం కోసం అందాలను ఆరబోయటం సరికాదని నా నమ్మకం. అందుకే నాకు తగిన , నేను చేయగలిగిన పాత్రల్ని మాత్రమే ఎంచుకుని చేస్తుంటాను.

నేను చేసినవి తక్కువ సినిమాలే. అయితే అవన్నీ ఏరి కోరి ఎంచుకున్నవి. డైరెక్టర్‌ని బట్టి, బ్యానర్‌ని బట్టి సినిమా అంగీకరించను. కొత్తవాళ్లలో కూడా మనకు తెలియని ప్రతిభ ఉంటుంది. అందుకే కథ, అందులో నా పాత్ర నచ్చితేనే ఓకే చెప్పేస్తాను.

వారంలో రెండు మూడు సార్లు యోగా చేస్తాను. నా భర్త ఫిట్‌నెస్‌ ట్రెయినర్‌ అయినా ఇలా చెయ్‌ అలా చెయ్‌ అంటూ నన్నేమీ ఫోర్స్‌ చేయరు. నాకు ఇష్టమైనప్పుడు నేను చేస్తాను. తగిన నిద్ర, సమయానికి ఆహారం, మంచినీళ్లు... ఇవే నా గ్లామర్‌ రహస్యాలు.

నేను కవిత్వం కూడా రాస్తాను తెలుసా! నేను రాసిన వంద కవితలతో ఓ పుస్తకం వేయాలన్న ఆలోచన కూడా ఉంది.

 
 

Copy right reserved for www.cinevinodam.com 2005