సినిమా తారలు తమ ఇమేజ్‌ని సొమ్ము చేసుకోవడంలో మహా ఘటికులు. సినిమాలతో పాటు, స్పెషల్ సాంగ్స్ చేయడం... యాడ్ ఫిలింస్‌లో నటించడం... న్యూఇయర్ వంటి సందర్భాల్లో హోటల్స్‌లో నర్తించడం... ప్రముఖ వ్యాపారుల ఇంట్లో పెళ్లికి హాజరై సందడి చేయడం వంటి బహుముఖ వ్యాపకాలతో నాలుగు చేతులా సంపాయిస్తున్నారు. ఇవి చాలక ఇప్పుడు బ్యూటీ, ఫిట్‌నెస్ బిజినెస్‌లోకి కూడా వస్తున్నారు.
ప్రముఖ నటి రేఖ అప్పట్లో యోగా క్యాసెట్స్ విడుదల చేస్తే అదో పెద్ద సంచలనం అయ్యింది. ఈ మధ్య శిల్పాశెట్టి కూడా యోగా వీడియో సిడిలతో జనాన్ని విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు అందాలనటి బిపాసా బసు ఆ కోవలో చేరింది. 'ఫిట్ అండ్ ఫ్యాబులస్' అనే పేరుతో శరీర సౌష్టవాన్ని కాపాడుకోవడానికి ఏ ఎక్సర్‌సైజ్‌లు చేయాలో వివరిస్తూ ఓ డి.వి.డిని బిపాసాబసు రూపొందించింది. ఆ డి.వి.డిని ఇటీవల ముంబాయిలో జరిగిన ఓ కార్యక్రమంలో తల్లితో పాటు బాయ్‌ఫ్రెండ్ జాన్ అబ్రహాంతో కలిసి విడుదల చేసింది. గ్లామర్‌తో మంచి శరీర సౌష్టవంతో ప్రేక్షకులను ఆకట్టుకునే బిపాసా తన ఫిట్‌నెస్‌తోనే బిజినెస్ చేయాలనుకుంటోంది. తాను ఆచరించిన ఎక్సర్‌సైజ్‌లు ఎంత ప్రయోజనకరమో చెప్పడంతో పాటు, రోజుకి అరగంట ఈ పద్ధతులు పాటిస్తే, అందమైన శరీరం మీ స్వంతం అంటూ హామీ ఇస్తోంది. సినిమాలతో బిజీగా ఉన్న బిపాసా బసు ప్రస్తుతం బాయ్‌ఫ్రెండ్ జాన్ అబ్రహామ్‌తో పెళ్ళి కాకుండానే సహజీవనం చేస్తోంది.
|