మసాలా
 
 
 
 
రింగు రింగు మంటున్న బిపాసా బసు
సుదీర్ఘకాలం ప్రేమాయణం తరువాత జాన్‌అబ్రహాంకు గుడ్‌బై చెప్పిన బిపాసాబసు తాజాగా బొడ్డుకు రింగు వేయించుకొని మరోసారి వార్తల్లో నిల్చింది. 16 ఏళ్ల వయసులో ఉన్నప్పటి నుంచే బొడ్డుకు రింగు పెట్టుకోవాలని కోరుకునేదానినని చెప్పింది. ‘రింగు చాలా బాగుంది. కానీ గాయం కాస్త మెల్లగా మానుతుంది. రాబోయే 15 రోజుల దాకా వ్యాయామాలు ఎక్కువ చేయడం కుదరదు’ అని బిప్స్ తన ట్విటర్ పేజీలో రాసుకొచ్చింది. ఈ బెంగాలీబ్యూటీ తన రింగు గురించి చెప్పగానే ఆన్‌లైన్ అభిమానులంతా బొడ్డుకు అయిన గాయం మానడానికి చిట్కాలను పంపిస్తున్నారు.

‘గాయం మాన్పించే చిట్కాలను చెబుతున్నవాళ్లందరికీ థ్యాంక్స్. గాయం ఉండడం వల్ల రింగు ఫొటోలను ప్రస్తుతానికి ట్విటర్ పోస్ట్ చేయడం సాధ్యంకాదు. త్వరలోనే అందరితోనూ చాట్ చేస్తా’ అంటూ బిపాసా సందేశం పోస్ట్ చేసింది. జాన్‌తో విడిపోయిన తరువాత నిరాశకు గురికాకుండా ఆత్మవిశ్వాసంతో జీవించడానికి ఈ 32 ఏళ్ల తార ప్రయత్నిస్తోంది. ‘ప్రతి ఒక్కరూ తమ భయాల నుంచి బయటికి రావాలి. ఎవరు ఎందుకు భయపడినా.. ఇప్పుడు కళ్లలోకి కళ్లుపెట్టి చూసే సమయం వచ్చింది. మనం ఇప్పుడు భయాన్ని అధిగమించాలి’ అని బిపాసా తన అభిమానులు, స్నేహితులకు నచ్చజెప్పింది. బాలీవుడ్‌లో హీరోయిన్లు గొడవలు పెట్టుకోవడం సహజమే అయినా దియామీర్జా మాత్రం బిప్స్ బొడ్డు నిర్ణయాన్ని ప్రశంసించింది. రింగుతో ఆమె మరింత హాట్‌గా కనిపిస్తుందని కితాబిచ్చింది. బిపాసా నటిస్తున్న అబ్బాస్ మస్తాన్ ‘ప్లేయర్స్’, మరో అంతర్జాతీయ చిత్రం ‘సింగ్యులారిటీ’లు త్వరలోనే విడుదలవుతున్నాయి.