సాధారణంగా రాజకీయ నాయకులకు జెడ్ కేటగిరి భద్రత కల్పిస్తుంది ప్రభుత్వం...ఇప్పుడు సినిమా
సెలెబ్రిటీలకు కూడా అటువంటి భద్రత తప్పదేమో అనిపిస్తోంది. తాజాగా బెంగళూరు బిఎల్‌ఆర్ ఎయిర్‌పోర్ట్
ఎంట్రన్స్‌లో మెల్లిగా నడిచివస్తున్న బిపాసాబసుకు అనుకోని ఓ హఠాత్సంఘటనతో ఉక్కిరిబిక్కిరి
అయిపోయిందట...ఓ వ్యక్తి అమాంతం బిప్స్ నడుం గట్టిగా ఉడుముపట్టుకున్నట్లు పట్టేసుకుని గాఢంగా
ఆమె పెదవులకు తన పెదవులు అందించేయడంతో అవాక్కయిపోయి...బిత్తరచూపులు చూస్తూ
నిలబడిపోయింది బిపాసాబసు. అంతలోనే తేరుకుని కోపంగా ఆ వ్యక్తికేసి చూడటంతో తాను ఆమె
అభిమానినని చెప్పగానే సంతోషంతో లోలోపల ఉప్పొంగిపోతూ...మరోసారి అలా చేయొద్దని సున్నితంగా
మందలించి ఎంచక్కా వెళ్లిపోయిందట విసవిసా నడుచుకుంటూ...ఇదంతా తన ట్విట్టర్‌లో రాసేసుకుంది
బిప్స్...ఇంతకీ అంతలా ముద్దులిచ్చినా...బిప్స్ ఏం చేయలేదని
ఆశ్చర్యపోతున్నారా...ఎందుకంటే ఆమెకు ముద్దులిచ్చి...ఒళ్లంతా తడిమేసిన వ్యక్తి ఓ నడివయసు
ఆంటీనట.
పైగా వాటేసుకుంది తన అభిమానాయే...ఇంకేం చేస్తుంది...అయినా ఈ భామకు ఇలాంటి
సంఘటనేమీ కొత్త కాదు. గతంలో శ్రీలంకలో జరిగిన అవార్డుల ఫంక్షన్‌లో కూడా ఓ అభిమాని బిప్స్‌ను
పట్టుకుని హడావిడి చేసేశాడట...అభిమానమంటే ఇలా కూడా ఉంటుందని బిప్స్ ఊహించివుండదు.
దీపికతో సిద్ధమంటున్న అభిమాని
'నన్ను పెళ్లాడతావా?' అంటూ బాలీవుడ్ అందాల తార దీపికా పదుకొనే(24) ముందు మోకరిల్లాడో
యువకుడు. ఒక్క క్షణం విస్మయానికి గురైన దీపిక.. యువకుడి ప్రతిపాదనను సున్నితంగా
తిరస్కరించింది. తాను వివాహానికి సిద్ధంగా లేనని చెప్పింది. కానీ, తాను సిద్ధంగా ఉన్నానని ఆ
యువకుడు అనడంతో ముసిముసి నవ్వులతో అక్కడి నుంచి వెళ్లిపోయింది ముద్దుగుమ్మ. తన రాబోయే
చిత్రం 'లఫంగే పరిండే' ప్రచారం కార్యక్రమంలో భాగంగా దేశ రాజధానికి వచ్చిన దీపికాకు బుధవారం ఈ
అనుకోని అనుభవం ఎదురైంది. అంతకుముందు దీపిక మాట్లాడుతూ.. మీడియా అత్యుత్సాహం
ప్రదర్శించినప్పటికీ తన వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తూనే ఉంటానని చెప్పారు.
|