విజయనిర్మల తర్వాత తెలుగు చిత్రరంగంలో మహిళా దర్శకురాలిగా అందరి మన్ననలు అందుకుంటున్న బి.జయ జనవరి 11న పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆమెకు ‘సినీవినోదం’ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతోంది. ఉన్నత విద్యావంతురాలైన జయ చాలాకాలంగా సినిమా జర్నలిస్టుగా కొనసాగుతున్నారు. ‘చంటిగాడు’, ‘ప్రేమికులు’, ‘మంగమ్మ గారి మనవడు’, ‘సవాల్’ మొదలైన చిత్రాలకు ఆమె దర్శకత్వం వహించారు. పలు సాంస్కృతిక సంస్థల సత్కారాలు పొందారు. త్వరలో జయ ఓ అగ్ర నిర్మాత సంస్థలో ప్రముఖ యువహీరోతో ఓ చిత్రం ప్రారంభిస్తున్నారు.
|