కత్రినాకైఫ్ లవర్స్‌క్లబ్‌లో తాజాగా ప్రముఖ దర్శకనిర్మాత ఆదిత్య చోప్రా చేరినట్లు బాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రముఖ నిర్మాత యాష్‌చోప్రా కుమా రుడైన ఆదిత్యచోప్రా.. రాణీముఖర్జీ మోజులో పడి భార్యకు విడాకులిచ్చేసాడు. యష్‌రాజ్ ఫిలింస్ నిర్మించగా ఘన విజయం సాధించిన ‘న్యూయార్క్’లో నటించిన కత్రినా కైఫ్‌పై ఆ చిత్ర నిర్మాణంలో ఉన్నప్పట్నుంచీ మనసు పారేసుకున్న ఆదిత్య చోప్రా ప్రస్తుతం ఆమె కోసం రాణీని సైతం వదులుకునేంత ప్రేమను పెంచుకున్నాడని బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అటు కత్రినా కూడా తన మాజీ గాడ్ ఫాదర్ సల్మాన్ అతి ప్రేమను, శారీరక హింసను భరించలేక, అతనికి క్రమంగా దూరమవుతూ వచ్చి.. చాన్నాళ్లపాటు రణబీర్‌కపూర్‌తో ఎఫైర్ నడుపుతూ వచ్చింది. రణబీర్ ఒకవైపు తనతో డేటింగ్ చేస్తూనే, మరోవైపు ప్రియాంకచోప్రాతో చెట్టాపట్టాలేసుకుంటూ తిరుగుతుండడాన్ని జీర్ణించుకోలేని కత్రినా.. నిర్మాత, దర్శకుడు కూడా అయిన ఆదిత్యచోప్రాకు దగ్గరవుతోందని తెలుస్తోంది.డ్రెస్సులు మార్చినంత ఈజీగా లవర్స్‌ను మార్చేయడం బాలీవుడ్ హీరోయిన్లకు వెన్నతో పెట్టిన విద్యే కాబట్టి.. ఆదిత్యతో కత్రినా సహజీవనం ఎన్నాళ్లు సాగుతుందో వేచి చూడాలి!

జాన్ తో సోనాలి సెహగల్
జాన్ అబ్రహం, బిపాసాబసుల ప్రణయబంధం గురించి అందరికీ తెలిసిందే...దాదాపు 2002 సంవత్సరం నుంచి సిన్సియర్‌గా సహజీవనాన్ని సాగిస్తున్నారు. అయితే మధ్యలో మీడియా పుణ్యమా అని కొన్ని మనస్పర్థలు వచ్చినా అవన్నీ మామూలేనని కొట్టిపారేశారు. అయితే బిప్స్ ఎప్పటికప్పుడు జాన్‌కు మరే హీరోయిన్‌ను దగ్గ రకాకుండా జాగ్రత్త పడుతూ వస్తునే ఉంది. ఇప్పుడు లేటెస్ట్‌గా... బుల్లితెర నుంచి తాజా అందాలతో సెగలు గక్కుతూ వచ్చే సింది సోనాల్ సెహగల్. ఇప్పటిదాకా బుల్లితెరపై హీరోయిన్‌గా కనిపించిన ఈ పాప జాన్ అబ్రహం సరసన హీరోయిన్‌గా ‘ఆషియానా’ చిత్రంలో నటిస్తోంది. అప్పటిదాకా బాగానే ఉంది. కానీ ఈ చిత్రంలో జాన్, సోనాల్ మధ్య చిత్రీకరించిన హాట్ రొమాంటిక్ సన్నివేశాలు చాలా రియలిస్టిక్‌గా ఉన్నాయంటున్నారు చిత్ర యూనిట్ సభ్యులు. అది చూసి బిప్స్‌కు చిర్రెత్తుకొచ్చిందట...అయినా కొత్తొక వింత...పాతొక రోత అన్న చందాన జాన్ కొత్త రుచుల కోసం పాకులా డుతున్నట్లు న్నాడు. ఎంతకాలం పాత ప్రేయసితో ప్రణయం సాగిస్తాడు మరి? ఈ సినిమాలో జాన్‌అబ్రహం అల్లరిచిల్లరగా తిరిగే జూదగాడుగా కనిపిస్తాడు. అనుకోకుండా ఓ సారి సోనాల్‌ను చూసి ఆమె ప్రేమలో పడతాడు. సోనాల్ కూడా జాన్ అబ్రహంను మంచివాడిగా మూడు నెలల్లో మార్చేస్తుంది. మధ్యలో ఎన్నో ఊహించని మలుపులు ఉంటాయంటున్నాడు చిత్ర దర్శకుడు . ఈ చిత్ర దర్శకుడు నగేష్ కుకునూర్ సహజత్వం కోసం జాన్, సోనాల్‌ల కిస్సింగ్ సీన్లు మరింత కిక్కిచ్చేలా చిత్రీకరిస్తున్నాడట.ఎంతగా అంటే షాట్ ఓ పట్టాన ఓకే చెయ్యనంతగా. అంతేకాదు ఈ సన్నివేశం ‘ఆషియానా’ చిత్రానికే ఓ పెద్ద మలుపు అని తెగ చెప్పేస్తున్నాడీ దర్శకుడు. ఏది ఏమైనా బిప్స్‌కు మాత్రం ఈ వ్యవహారం నచ్చడంలేదట.
|