మసాలా
 
 
 
 
బిజినెస్స్ లోకి బ్రిట్నీ స్పియర్స్‌...!
‘బేబీ వన్‌ మోర్‌ టైమ్‌..., ఊప్స్‌...ఐ డిడ్‌ ఇట్‌ అగెయిన్‌...’వంటి సూపర్‌ హిట్‌ పాప్‌ సాంగ్స్‌తో యువతను ఉర్రూతలూగించిన పాప్‌ క్వీన్‌ బ్రిట్నీ స్పియర్స్‌. ఆమె తన మొదటి రెండు హిట్‌ ఆల్బమ్స్‌తోనే పాప్‌ ప్రపంచంలో అగ్రస్థానానికి చేరుకున్నారు. దశాబ్ద కాలానికి పైగా పాప్‌ సింగర్‌గా కొనసాగుతున్న ఆమె ఎంతో డబ్బు సంపాదించారు. ఈ డబ్బు వృథాగా ఖర్చుకాకుండా ఏదైనా వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టి మంచి పెద్ద మొత్తంలో సంపాదించాలని ఈ సెలబ్రిటీ సింగర్‌ భావిస్తున్నారు.

అమెరికాకు చెందిన పాప్‌ సింగర్‌, రికార్డింగ్‌ ఆర్టిస్ట్‌ బ్రిట్నీ స్పియర్స్‌ 1999లో తన మొదటి మ్యూజిక్‌ ఆల్బమ్‌ను విడుదల చేశారు. మొదటి రెండు ఆల్బమ్‌లు సూపర్‌ హిట్‌గా నిలిచి టీన్‌ పాప్‌ క్వీన్‌గా ఎంతో పాపులారిటీ సంపాదించారు. గడిచిన 11 సంవత్సరాల కాలంలో ఆమె బేబీ వన్‌ మోర్‌ టైమ్‌, ఊప్స్‌ ఐ డిట్‌ ఇట్‌ అగెయిన్‌, బ్రిట్నీ, ఇన్‌ ద జోన్‌, బ్లాక్‌ ఔట్‌, సర్కస్‌ మ్యూజిక్‌ ఆల్బమ్‌లను విడుదల చేసి విపరీతంగా డబ్బు సంపాదించారు. ఒక్కో మ్యూజిక్‌ ఆల్బమ్‌ రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయి. ఆమె తన మ్యూజిక్‌ ఆల్బమ్‌ల విక్రయాలతో పాప్‌ ప్రపంచంలో కొత్త రికార్డులను సృష్టించారు. దీంతో ఆమె మిలియన్ల డాలర్ల డబ్బును సంపాదించారు.

ఈ డబ్బు వృథాగా ఖర్చు కాకుండా దాన్ని పూర్తిగా సద్విని యోగం చేసేందుకు ఈ మొత్తాన్ని తన ఫైనాన్షియల్‌ అడె్వైజర్స్‌ అయిన మెరిల్‌లించ్‌, యుబిఎస్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌కు అందజేశారు. సేవా కార్యక్రమాలకు వెచ్చించేందుకు ఆమె పెద్దమొత్తంలో డబ్బును తన ట్రస్ట్‌ అక్కౌంట్‌లో జమచేశారు. ఇక తన డబ్బులను అందజేసిన ఫైనాన్షియల్‌ కంపెనీలు ఈ మొత్తాన్ని ఏదైన మంచి వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టి పెద్ద మొత్తంలో ఆదాయాన్ని సంపాదించి పెట్టాలని ఆమె కోరుకుంటున్నారు. ‘పాప్‌ ప్రపంచంలో స్టార్‌ సింగర్‌గా రాణించేందుకు ఎంతో కష్టపడ్డాను. సింగర్‌గా కెరీర్‌ ప్రారంభంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాను. అన్ని అడ్డంకులను తట్టుకుంటూ నేడీ స్థాయికి చేరుకోగలిగాను. సింగర్‌గా మారడానికి ముందు ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నాను. చివరికి పాప్‌ క్వీన్‌గా ఎదగడంతో నా కష్టానికి తగ్గ ఫలితం దక్కినట్టయ్యింది.

పలు హిట్‌ మ్యూజిక్‌ ఆల్బమ్‌లను రూపొందించి మ్యూజిక్‌ లవర్స్‌ను అలరించాను. హిట్‌ సాంగ్స్‌ను అందించేందుకు రాత్రింబవళ్లు కష్టపడ్డాను. ఈ నేపథ్యంలో హిట్‌ మ్యూజిక్‌ ఆల్బమ్స్‌ రూపుదిద్దుకొని రికార్డు స్థాయిలో అవి అమ్ముడయ్యాయి. పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించగలిగాను. కానీ డబ్బులను వృథాగా ఖర్చుపెట్టకుండా నా పిల్లలకు అందించాలనేదే నా కోరిక. ఇందుకోసం నా దగ్గర ఉన్న మిలియన్ల డాలర్లను ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ వారికి అందజేశాను. ఈ డబ్బును పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ మంచి వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టాలన్నదే నా కోరిక. ఇక కేవలం సంపాదనే కాదు నా వద్ద ఉన్న మొత్తంలో కొంత సేవా కార్యక్రమాలకు కూడా వెచ్చించాలని భావించి నా సొంత ట్రస్ట్‌ అక్కౌంట్‌లో జమ చేశాను’ అని బ్రిట్నీ పేర్కొన్నారు.