Bookmark and Share   Cinevinodam
Subscribe
 
 
బ్రిట్నీ స్పియర్స్ పెద్ద మనసు

      * పాప్‌ క్వీన్‌ బ్రిట్నీ స్పియర్స్‌ది నిజంగా పెద్ద మనసే. లేకపోతే ఎంతో మురిపెంగా దాచుకున్న తన కిష్టమైన డ్రెస్‌ను వదులుకుంటుందా? పాపులారిటీ కోసం దుస్తుల పొదుపు మంత్రం పాటించే హాలీవుడ్‌ సుందరాంగులు వాటితోనే అప్పుడప్పుడు మంచి పనుల చేస్తారని ఈ భామ నిరూపించింది. ఇంతకీ విషయమేమంటే - హైతీ భూకంపంలో బాధితుల కష్టాలకు చలించిపోయిన బ్రిట్నీ తన వంతుగా ఏదైనా చేయాలనుకుంది. అనుకున్నదే తడవుగా తనెంతో ఇష్టపడి ప్రత్యేకంగా డిజైన్‌ చేయించుకున్న గౌను వేలం వేయాలనుకుంది. ఆ గౌను తళతళల వెనుక బోలెడు చరిత్ర ఉంది. 2008 ఎంటివీ మ్యూజిక్‌ అవార్డుల కార్యక్రమంలో ఈ వెండిరంగు గౌనే సెంటరాఫ్‌ అట్రాక్షన్‌. ప్రత్యేకించి ఎన్నో డిజైన్లు చూసి ఎంచుకుని, చేయించుకుని, వేయించుకుని వేదికపై అందాన్ని మెరిపించుకున్న గౌనది. బ్రిట్నీ స్వయంగా గౌను పట్టుకుని నుంచుంటే వేలం వెర్రులెత్తిపోదూ. అదే ఆమె ధీమా మరి. ఆ సొమ్మంతా విరాళంగా ఇస్తుందిట. ఈమె బాటనే అనుసరిస్తూ కురచ డ్రెస్‌ల పాప్‌ సింగర్‌ లేడీ గాగ, సుసాన్‌ సారండన్‌ కూడా దుస్తుల వేలానికి సిద్ధమయ్యారు.

 
 

Copy right reserved for www.cinevinodam.com 2005