మసాలా
 
 
 
 
బ్రిటీష్‌ అందాల రాశిగా.. కేథరీన్
హాలీవుడ్‌ అందాల తార కేథరీన్‌ జెటా జోన్స్‌ పలు హిట్‌ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సంపాదించుకున్నారు. తన అందచందాలు, గ్లామర్‌తో పాటు చక్కటి నటతో ఈ తార అందర్నీ అలరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమెను అగ్రస్థానంలోని బ్రిటీష్‌ అందాలరాశిగా(జీవించి ఉన్నవారిలో) ఓ హాలీవుడ్‌ వెబ్‌సైట్‌ కీర్తించింది. వారు నిర్వహించిన ఓ పోల్‌లో ఈ విషయం వెల్లడైంది.

41 సంవత్సరాల కేథరీన్‌ తన అందచందాలతో హాలీవుడ్‌ వెబ్‌సైట్‌ నిర్విహంచిన పోల్‌లో తన కంటే చిన్న వయసు తారలను కాదని బ్రిటీష్‌ అందాలరాశుల లిస్ట్‌లో అగ్రస్థానాన్ని ఆక్రమించేశారు. ఈ తారకంటే వయసులో చిన్నవారైన బ్రిటీష్‌ అందగత్తెలైన ‘ఎక్స్‌ ఫ్యాక్టర్‌’ భామ చెరీల్‌ కోల్‌(28), కెలీ బ్రూక్‌ (31) కేథరీన్‌ అందం ముందు వెలవెలబోయారు.

ప్రస్తుతం జీవించి ఉన్నవారిలో కేథరీన్‌ నెంబర్‌ వన్‌ స్థానాన్ని ఆక్రమించగా ఆల్‌టైమ్‌ బ్యూటీస్‌లో మాత్రం నాలుగవ స్థానంతో సరిపెట్టుకోక తప్పలేదు. ఈ లిస్ట్‌లో 1993లో చనిపోయిన ‘బ్రేక్‌ఫాస్ట్‌ ఎట్‌ టిఫనీస్‌’ తార ఆడ్రీ హెప్‌బర్న్‌లో అగ్రస్థానాన్ని అలంకరించారు. పాతతరం హాలీవుడ్‌ అందాల నటీమణుల్లో ఒకరైన ఎలిజబెత్‌ టేలర్‌ ఈ లిస్ట్‌లో రెండవ స్థానంలో ఉన్నారు. అందాలరాశిగా పేరుగాంచిన ప్రిన్సెస్‌ డయానా బ్రిటీష్‌ బ్యూటీస్‌లో మూడవ స్థానంలో నిలిచారు. 2,000మంది ఈ పోల్‌లో పాల్గొని అందగత్తెలకు ర్యాంకింగ్‌లిచ్చారు. ఇక ఈ లిస్ట్‌ టాప్‌-10లో అందాల తారలు కీర నైట్లీ, కేట్‌ బెకిన్‌సేల్‌, టివి ప్రెజెంటర్‌ హాలీ విల్లోహ్‌బీలు ఉన్నారు.