మసాలా
 
 
 
 
సెలీనా పెళ్లి కాకముందే గర్భవతా?
సెలీనా జైట్లీ ఇటీవల జరిగిన తన వివాహంతో ఎంతో సంతోషంగా ఉన్నా కొన్ని విషయాలు ఆమెను బాధపెడుతున్నాయి. సెలీనా పెళ్లికి ముందే గర్భ వతని పళ్లికాకముందే ఆమెకు కాన్పు జరిగే అవకాశం ఉందనే పుకార్లు విని పించాయి. ఈ విషయం సెలీనాకు తెలియడంతో ఎంతో బాధపడ్డారు.

పెళ్లి సమయంలో సెలీనా గర్భవతని కొన్ని వార్తలు వినిపించాయి. మరికొంద రైతే ఆమె నిండు గర్భిణీ అని పెళ్లికి ముందే డెలివరీ కూడా కావచ్చని పుకార్లు కూడా సృష్టించారు.

ఈ ఏడాది జూలై 23న తన బాయ్‌ఫ్రెండ్‌ పీటర్‌ హాగ్‌ను ఆస్ట్రియాలో వివాహమాడిన సెలీనాకు ఈ పుకార్లు తలనొప్పిని సృష్టించాయి. ‘సెలీనా కడుపునొప్పితో బాధపడి దుబాయ్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్సచేయిం చుకున్నారు. కానీ ఆమె గర్భవతని అందుకే ఆసుపత్రికి వెళ్లిందనే వార్తలు రావ డంతో ఆమె ఎంతో బాధపడ్డారు’ అని సెలీనా మిత్రురాలు ఒకరు చెప్పారు. ఈ పుకార్లతో సెలీనా, పీటర్‌ హాగ్‌లు ముందు బాధపడ్డా ఆ తర్వాత వీటిని పట్టించుకోవద్దని నిర్ణయించుకున్నారు. ఇక సెలీనా, పీటర్‌లు ఆస్ట్రియాలో పెళ్లి చేసుకోవడానికి ఓ కారణముంది. అనారోగ్యంతో జీవితం చివరి దశలో ఉన్న అమ్మమ్మ తన పెళ్లిని చూసేందుకు పీటర్‌ ఆస్ట్రియాలో వివాహం చేసుకున్నాడు.

ఈ పెళ్లయిన కొద్ది రోజులకే పీటర్‌ అమ్మమ్మ కన్నుమూసింది. ఆ తర్వాత పీటర్‌, సెలీనాలు తిరిగి దుబాయ్‌కి వచ్చి నివసించారు. ‘పెళ్లి అనేది నా జీవితంలో మధురానుభూతి. పీటర్‌తో వివాహానంతరం కొత్త జీవితాన్ని సంతోషంగా ప్రారంభించాను. ఇక నేను గర్భవతని కొందరు లేనిపోని పుకార్లు సృష్టిస్తున్నారు. ఒకవేళ నేను నిజంగా తల్లిని కాబోతుంటే వెంటనే ఈ విషయాన్ని ప్రకటిస్తాను’ అని సెలీనా వెల్లడించారు.