షాహిద్‌కపూర్, జెనీలియా కలిసి నటిస్తున్న చిత్రం - 'చాన్స్ పే డాన్స్'. డాన్స్‌కు, కామెడీకి, ఎమోషన్స్‌కి ప్రాధాన్యమున్న చిత్రం ఇది. కెన్ ఘోష్ - ఈ చిత్రానికి దర్శకుడు. ఇందులో షాహిద్-జెనీలియాల మధ్య ఓ ముద్దు సీను ఇద్దరి మధ్య ప్రణయ సన్నివేశాలలో భాగంగా ఓ చోట చోటుచేసుకుంటుంది. కాస్తంత 'హాట్'గానే... గాఢంగా ఉండే కిస్ సీన్ అది. దర్శకుడు ఆ సీన్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి మరీ చిత్రీకరించారు.
ఆ సీన్ చూసుకున్న తర్వాత అందరూ మెచ్చుకుంటారు, ముఖ్యంగా యూత్‌ని అది బాగా ఆకట్టుకోవడం ద్వారా సినిమాకి కలెక్షన్స్ బాగా పెరుగుతాయి అనుకున్నారు దర్శకుడు. అయితే అతని ఆశలమీద నీళ్లు చల్లుతున్నట్లు ఆ ముద్దు సీన్ మొత్తాన్ని తొలగించవలసిందిగా హీరో షాహిద్ కోరారట. దానికి కారణం పిల్లలు, మహిళలు... ఆ సీన్ వలన సినిమాకి రాకుండా పోయే ప్రమాదం ఉందని షాహిద్ భావించారట.
ఫ్యామిలీ మొత్తం చూసి ఎంజాయ్ చేసే సినిమాలో ఆ ఒక్క సీన్ వలన ఒక సెక్షన్ ఆడియెన్స్‌కి ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉన్నందున కిస్ సీన్ తీసేద్దాం అని సలహా ఇచ్చారట షాహిద్ దర్శకుడితో. మనసు పెట్టి తీసిన ఆ సీన్‌ని తొలగించడానికి మొదట అంగీకరించని కెన్‌ఘోష్... ఆ తర్వాత షాహిద్ చెప్పినది కరెక్టే అని భావించి టోటల్‌గా ఆ సీన్ మొత్తాన్ని తొలగించడానికి ఒప్పుకున్నారట. దాంతో తన ఫ్యాన్స్‌లో ఎక్కువ పిల్లలున్నారని, వారంతా ఇప్పుడు సినిమా చూడటానికి ముందుకొస్తారని హ్యాపీగా ఫీలయాయరట షాహిద్‌కపూర్. చిత్రాన్ని ఆరోగ్యకర పంథాలో చూపించాలని షాహిద్ అనుకోవడం అభినందించతగ్గ విషయం.
|