మసాలా
 
 
 
 
పర్వతారోహకుని కథతో డానిబోయిలే
'స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌' లాంటి చిత్రాన్ని కెరీర్‌లో ఒకసారే చేయగలం. మళ్లీ మళ్లీ ఆ స్థాయిలో చేయాలంటే సాధ్యం కాదు. అనూహ్యమైన పాపులారిటీ కోసం ఈ సినిమాను తీయలేదు. అదేవిధంగా ఇప్పుడు తీసిన '127 అవర్స్‌' కూడా అంతే, అవార్డుల కోసమో, పాపులారిటీ కోసమే తీయలేదు. కమర్షియల్‌ హిట్‌ కొట్టాలన్న ఆరాటం కూడా లేదు. 2006 సంవత్సరంలోనే ఓ మంచి కథ అనుకున్నా. పర్వతారోహకుడు ఆరాన్‌ రాల్‌స్టన్‌ నిజ జీవిత కథను వెండితెరకు ఎక్కించాలనుకున్నా. కాకపోతే 'స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌' వల్ల నాకు దక్కిన ప్రాముఖ్యతను ఉపయోగించుకొని, ఈ చిత్రానికి కావాల్సిన బడ్జెట్‌ను రూపొందించుకున్నా' అని ప్రముఖ బ్రిటిష్‌ దర్శకుడు డానీ బోయల్‌ అంటున్నాడు. ఆయన తాజా చిత్రం '127 అవర్స్‌' పలు చిత్రోత్సవాల్లో విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంతకీ కథలో విశేషమేంటి ! డానీబోయల్‌ మాటల్లో...'ఇది చాలా అద్భుతమైన కథ. ఆరాన్‌ రాల్‌స్టన్‌ ఆటోబయోగ్రఫీ అందరికీ చెప్పాలనిపింది. జీవన పోరాటానికి మించిన కథ. తన జీవితంలో కొంతమంది విలువేంటో మొదట తెలియదు. ఓ సంఘటన అతనిలో మార్పు తెస్తుంది' అని వివరించారు.

ఎ.ఆర్‌.రెహమాన్‌ గురించి చెబుతూ...'ఇఫ్‌ ఐ రైజ్‌ అనే పాట ఇప్పటికే సంచలనం సృష్టిస్తోంది. భిన్నత్వాన్ని కోరుకునే వ్యక్తి. కొత్తదనం కోసం పరితపిస్తుంటాడు. చాలా చిన్న స్థాయి నుంచి ఎదిగినవాడు. మంచి ప్రతిభ ఉంది. అతనితో పనిచేయడమంటే ఇష్టం. ప్రస్తుతం 2012 లండన్‌ ఒలంపిక్స్‌ నిర్వహణలో పాలుపంచుకునే ఆర్టిస్టిక్‌ డైరెక్టర్ల ఎంపికలో ఉన్నాను. ఇది నాకు కొత్త బాధ్యత. ప్రారంభోత్సవాలు ఘనంగా జరపడానికి సన్నాహకాలు జరుగుతున్నాయి' అని తెలిపారు.