మసాలా
 
 
 
 
సాకర్ ప్లేయర్ బెక్ హామ్ సినిమాల్లోకి...
సాకర్‌ స్టార్‌ డేవిడ్‌ బెక్‌హామ్‌ త్వరలో హాలీవుడ్‌ సినీ రంగ ప్రవేశం చేస్తున్నారు. హిట్‌ సినిమా ‘ఎస్కేప్‌ టు విక్టరీ’ రీమేక్‌ చిత్రంలో ఆయనను హీరోగా తీసుకున్నట్టు సమాచారం. హాలీవుడ్‌ రంగ ప్రవేశం చేస్తున్న బెక్‌హామ్‌తో కలిసి నటించే అవకాశం తనకు దక్కుతుందని ఆశిస్తున్నట్టు మరో సాకర్‌ స్టార్‌ పీలే కూడా పేర్కొంటున్నారు.

ఇంగ్లాండ్‌ సాకర్‌ స్టార్‌ ప్లేయర్‌ డేవిడ్‌ బెక్‌హామ్‌ తొందరగా హాలీవుడ్‌ కెరీర్‌ను ప్రారంభించాలని ఒకప్పటి సాకర్‌ దిగ్గజం పీలే ఆశిస్తున్నారు. తనకు కూడా సినీ అవకాశం దక్కితే బెక్‌హామ్‌తో కలిసి నటిస్తానని ఆయన పేర్కొంటున్నారు. బాబీ మూర్‌, సిల్వర్‌స్టర్‌ స్టాలోన్‌ నటించిన హిట్‌ సినిమా ‘ఎస్కేప్‌ టు విక్టరీ’ని రీమేక్‌ చేసేందుకు ప్రయత్నాలు జరగడం పట్ల పీలే సంతోషం వ్యక్తంచేశారు. ఈ సినిమా రీమేక్‌ వార్తను తెలుసుకొని తాను ఆనందపడ్డానని ఆయన చెప్పారు. ‘సినిమాలో హీరోగా చేస్తున్న బెక్‌హామ్‌తో కలిసి నటించేందుకు నాకు కూడా అవకాశం వస్తుందని తెలిసింది. ఒకవేళ ఇదే జరిగితే నా జీవితంలో ఇది మరచిలేని సంఘటనగా మిగిలిపోతుంది’ అని పీలే పేర్కొన్నారు. బెక్‌హామ్‌ పాపులర్‌ సాకర్‌ ప్లేయర్‌ అని అతనితో కలిసి నటించడం అరుదెైన అవకాశంగా భావిస్తానని ఆయన చెప్పారు. ఇ సినీ నటునిగా మారిన మాజీ ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు విన్నీ జోన్స్‌(45) క్లాసిక్‌ మూవీ ఎస్కేప్‌ టు విక్టరీ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు.