మసాలా
 
 
 
 
బాయ్‌ఫ్రెండ్‌తో బాలీలో జాలీగా...
లిక్కర్‌ కింగ్‌ విజయ్‌ మాల్యా తనయుడు సిద్దార్థ మాల్యా బాలీవుడ్‌ అందాల తార దీపికా పదుకునేతో సాగిస్తున్న ప్రేమాయణం అందరికీ తెలిసిందే. ఈ జంట విదేశాల్లోని పలు పర్యాటక ప్రాంతాలకు వెళ్లి గత కొంతకాలంగా హాయిగా సేదతీరుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ జంట బాలీలో కొన్ని రోజుల పాటు సరదాగా గడిపారు.

సిద్దార్థకు వరుసకు చెల్లెలు అయే యువతి వివాహం బాలీలో జరిగింది. దీంతో దీపికా పదుకునే లండన్‌లో తన సినిమా షూటింగ్‌కు కొంత బ్రేక్‌ ఇచ్చి బాలీ ట్రిప్‌కు కొందరు స్నేహితులతో కలిసి వెళ్లారు. అక్కడ పెళ్లికి హాజరైన అనంతరం తన బాయ్‌ఫ్రెండ్‌ సిద్దార్థ మాల్యాతో కలిసి బాలీలోని పలు పర్యాటక ప్రాంతాల్లో హాయిగా సేదతీరారు. కొద్ది రోజుల పాటు బాలీలో సిద్దార్థతో కలిసి దీపికా ఎంతో సంతోషంగా గడిపారు. పెళ్లి వేడుక సిద్దార్థ, దీపికాలకు కలిసి గడిపేందుకు మంచి అవకాశంగా మారింది. పార్టీలు, ఫంక్షన్లు, షికార్లతో వారు రోజంతా బిజీగా గడిపారు.

ప్రస్తుతం సిద్దార్థ కుటుంబానికి దీపికా చాలా సన్నిహితంగా మారారు. పెళ్లి వేడుకకు కొద్దిరోజుల ముందుగానే వచ్చిన దీపికా వివాహానంతరం కూడా బాలీలోనే ఉన్నారు. లండన్‌లో షూటింగ్‌ జరుపుకుంటున్న కాక్‌టైల్‌ చిత్రంలో గత కొన్ని రోజులుగా బిజీగా గడిపిన దీపికాకు బాలీ ట్రిప్‌ మంచి వినోదాన్నిచ్చింది. తనకిష్టమైన సిద్దార్థతో గడిపి మధురానుభూతులను పొందారు. ‘ సిద్దార్థ చెల్లెలు పెళ్లికి హాజరయ్యేందుకు బాలీకి వచ్చాను. గత కొన్ని రోజులుగా లండన్‌లో కాక్‌టైల్‌ సినిమా షూటింగ్‌లో బిజీగా గడిపి అలసి పోయాను. ఈ సమయంలో బాలీ ట్రిప్‌ నాకు పూర్తిగా సేదతీరేందుకు మంచి అవకాశంగా మారింది. నా బాయ్‌ఫ్రెండ్‌ సిద్దార్థతో కలిసి బాలీలోని విహార కేంద్రాలను తిలకించడం మరచిపోలేని అనుభూతులను మిగిల్చింది’ అని దీపికా పేర్కొన్నారు.