మసాలా
 
 
 
 
ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్నా
'ఓం శాంతి ఓం' సినిమాతో బాలీవుడ్‌ ప్రవేశం చేసిన సోయగం దీపికా పదుకునే. బాక్సాఫీస్‌ వద్ద తగినన్ని విజయాలు లేకపోయినా సంచలన తారగా ప్రయాణాన్ని సాగిస్తోంది. అందం, అభినయం కావాల్సినంత ఉన్న నటిగా ఆవిడ్ని సినీ విమర్శకులు పేర్కొంటారు. తెరపై కొన్ని ప్రయోగాత్మక పాత్రలు చేయాలని, తద్వారా ప్రేక్షకులకు దగ్గర కావాలని దీపికా భావిస్తోంది.

ఇంకా ఏమందంటే...

* ఎప్పుడూ నవ్వుతూ కనిపించాలన్నదే నా ప్రయత్నం. అలాగని నాలో కొన్ని వ్యతిరేక ఆలోచనలు లేవని కాదు. ప్రతి మనిషిలోనూ అలాంటి ఛాయలు కొన్ని ఉంటాయి. అయితే అవి ఏమేరకు అన్నది ముఖ్యమైన విషయం.

* రోజూ ఐదు నుంచి ఆరు గంటలు మాత్రమే నిద్రపోతాను. ఎప్పుడు ఏం చేయాలన్నది నాకు మాత్రమే సంబంధించిన విషయం. అరదుకే నా విషయంలో ప్రతిదీ ఇష్టప్రకారమే జరుగుతుంది.

* చిత్ర పరిశ్రమలో ప్రత క్షణాన్ని ఆస్వాదిస్తున్నా. అయితే ఈ పేరు ప్రఖ్యాతలు ఎప్పుడూ కలకాలం నిలిచి ఉంటాయన్న భ్రమల్లో మాత్రం లేను. నిరంత మార్పుకు లోనవ్వటం సినిమాల్లో వేగంగా జరుగుతుంది. భవిష్యత్తు గురించి అతిగా ఆలోచించే అలవాటు లేదు.

* గతేడాది నటించిన చిత్రాలన్నీ పరాజయం పాలయ్యాయి. అయినా నిరుత్సాహాపడటం లేదు. జయాపజయాలన్ని మనం నిర్దేశించలేం. ఫలానా సినిమా బాగుందని చెబుతారు. తీరా సినిమా వాణిజ్యపరంగా నిలదొక్కుకోదు. ఒక సినిమా అస్సలు బాగోలేదని ప్రచారంలోకి వస్తుంది. కానీ బాగా డబ్బులొస్తాయి. ప్రతీ సంగతిని అనుభవంగా తీసుకోవాలి. బాధపడకూడదు.

* చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన మొదటి రోజు నుంచీ సల్మాన్‌తో కలిసి నటించేందుకు ప్రయత్నిస్తున్నా. అయితే ఇప్పటిదాకా తగిన కథ రాలేదు. మధ్యలో ఒకట్రెండ్‌ అవకాశాలొచ్చాయి. కానీ తెరపైకి సినిమాగా రావటంలో విఫలమయ్యాయి.

* వ్యక్తిగత విషయాల్ని చెప్పుకోవడానికి సినిమాల్లోకి రాలేదు. చేస్తున్న వృత్తికి ప్రాధాన్యమిస్తా. మాట్లాడితే సినిమా గురించే మాట్లాడాలి. వేరే ఇతర విషయాలు చెప్పుకోని లాభమేంటి ! పోనీ వ్యక్తిగత విషయాలూ చెప్పినా...వాటి పట్ల ఆసక్తి ఉంటుందే కానీ, సినిమా గురించి ఎవ్వరూ ఆలోచించరూ.