మసాలా
 
 
 
 
డిస్నీలో షబానా,సుహాసిని
సెలవుల్లో చిన్నారుల కోసం డిస్నీ జూనియర్‌ కొత్తగా రెండు యానిమేటెడ్‌ సిరీస్‌లను ప్రసారం చేయనుంది. ఎ పోయెం ఈజ్‌..., టేస్టీ టైమ్‌ విత్‌ చెఫ్‌ జెఫ్రోంక్‌ వీటిలో ఉన్నాయి. డిసెంబర్‌ 19న వీటి ప్రసారం ఆరంభం కానుంది. డిస్నీ ఛానల్‌లో ఇవి రోజులో పలు మార్లు ప్రసారం కానున్నాయి.‘ఎ పోయెం ఈజ్‌...’ అనేది షార్ట్‌ యానిమేటెడ్‌ సిరీస్‌. డిస్నీ క్లాసిక్‌ సినిమాలు ‘డంబో’, ‘బాంబీ’, ‘లేడీ అండ్‌ ది ట్రాంప్‌’ తదితర చిత్రాల్లోని దృశ్యాలు కూడా ప్రసారం కానున్నాయి. గేయాలు అంటే ఇష్టపడే ప్రముఖ సినీతార షబానా అజ్మీ హిందీలో వీటిని వర్ణించి వివరించనున్నారు. ప్రముఖ సినీతార, దర్శకురాలు సుహాసినీ రత్నం తెలుగులో ఈ కార్యక్రమాన్ని సమర్పించను న్నారు.

ఓ గేయంలో ఉండే అందం ఈ కార్యక్రమంలో చిన్నారు లను, పెద్దలను అలరించనుంది. రాబర్ట్‌ లూయిస్‌ స్టీవెన్‌సన్‌, జాన్‌ హోవర్డ్‌ పేస్‌, ఎ.ఎ.మిల్న్‌, హెన్రీ వాడ్స్‌వర్త్‌ లాంగ్‌ఫెలో తదితరుల గేయాలు ఇందులో ప్రసారం కానున్నాయి.ఈ సందర్భంగా షబానా అజ్మీ మాట్లాడుతూ, ‘చిన్న చిన్న పద్యాలు, గేయాలు చదివేందుకు, రాసేందుకు పిల్లలు బాగా ఇష్టపడుతారు. అవి వారిలోని ఊహాశక్తిని, సృజనాత్మకతను పెంపొందిస్తాయి. తమ భావాలను వారు వ్యక్తం చేసేలా చేస్తాయి. నేర్చుకునేందుకు, గుర్తు పెట్టుకుంనేందుకు, పంచుకునేందుకు ఇవో చక్కటి మార్గం. కొన్ని పద్యాలు అమ్మ మనస్సులా నులివెచ్చగా ఉంటాయి. మరి కొన్ని ఎంతో ఫన్నీగా పిల్లల్ని నవ్వించేలా ఉంటాయి’ అని అన్నారు.

ఐదు నిమిషాల వ్యవధి కల షార్ట్‌‌స కూడా డిస్నీ జూనియర్‌లో ప్రసారం కానున్నాయి. టేస్టీ టైమ్‌ విత్‌ జెఫ్రోంక్‌ అనేది పిల్లలను వంటకాలు చేసుకునేందుకు ప్రోత్సహించేలా, అందులో వినోదం పొందేలా చేస్తుంది. ఇందులో చెఫ్‌ జెఫ్రోంక్‌కు ప్రముఖ కామిక్‌ నటి విద్య తన గొంతునిచ్చారు. ఈ యానిమేషన్‌ షార్ట్‌లో తన డాగ్‌హౌస్‌లో చెఫ్‌ జెఫ్రోంక్‌ తన అసిస్టెంట్‌, సాంగ్‌బర్డ్‌ స్యూతో కలిసి చేసే పనులు పిల్లలను ఆకట్టుకుంటాయి. ప్రతీ ఎపిసోడ్‌లో వీరు పిల్లలకు ఓ వైపున వినోదాన్ని అందిస్తూనే, ఆరోగ్యదాయక స్నాక్స్‌ ఎలా చేసుకోవాలో కూడా పిల్లలకు నేర్పిస్తారు.

ఈ సందర్భంగా విద్య మాట్లాడుతూ, ‘చిన్నప్పటి నుంచి కూడా డిస్నీ ఛానల్‌ అంటే నాకెంతో ఇష్టం. అలాంటి ఛానల్‌ కార్యక్రమం లో పాల్గొనడం ఎంతో ఆనందదాయకం. పిల్లలు చిన్ననాటి నుంచి కూడా వంట పనులు చూసేందుకు, వాటిని చేయడానికి ఇష్టపడుతుంటారు. వినోదంతో పాటు వంటకాలను చేయడాన్ని ఈ కార్యక్రమం నేర్పిస్తుంది’ అని అన్నారు. డిస్నీ జూనియర్‌ కంటెంట్‌ను ఆన్‌లైన్‌లో కూడా చూడవచ్చు.