Bookmark and Share   Cinevinodam
Subscribe
 
 
రవితేజ 'డాన్‌ శీను' ప్రారంభం

      'కిక్‌' వంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని అందించిన ఆర్‌.ఆర్‌.మూవీ మేకర్స్‌ పతాకంపై మలినేని గోపీచంద్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ 'డాన్‌ శీను' నిర్మిస్తున్నారు. రవితేజ - త్రిష జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీహరి ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్ర ప్రారంభంలో ఎన్టీఆర్‌ క్లాప్‌ ఇవ్వగా, డి.రామానాయుడు కెమెరాస్విచాన్‌ చేశారు. వినాయక్‌ తొలిషాట్‌కు దర్శకత్వం వహించారు.

సమర్పకులు కె.అచ్చిరెడ్డి మాట్లాడుతూ- 'ఈ చిత్రంతో పరిచయం అవుతున్న గోపీచంద్‌ మంచి కమర్షియల్‌ థాట్స్‌ వున్న దర్శకుడు. సినిమా సినిమాకీ ఎదుగుతున్న హీరో రవితేజ 'కిక్‌'తో మా సంస్థకు మంచి ఇమేజ్‌ తెచ్చారు. వీరి కాంబినేషన్‌లో 'డాన్‌ శీను' చేయడం ఆనందంగా వుందని' అన్నారు.

రవితేజ మాట్లాడుతూ- 'నా కెరీర్‌లో బెస్ట్‌ ప్రొడ్యూసర్స్‌ ఆర్‌.ఆర్‌.మూవీమేకర్స్‌. వీరితో మళ్ళీ మళ్ళీ చేయాలనుంది. 'డాన్‌ శీను' మంచి ఎంటర్‌టైనర్‌ అవుతుంద'ని అన్నారు. గోపీచంద్‌ మాట్లాడుతూ- 'ఎనర్జిటిక్‌ హీరో రవితేజతో ప్రముఖ సంస్థ ఆర్‌.ఆర్‌.మూవీ మేకర్స్‌లో తొలి చిత్రం చేయడం ఆనందంగా వుంది. ఇందులో రవితేజ, శ్రీహరి కాంబినేషన్‌ ఆసక్తికరంగా వుంటుందని' అన్నారు.

రచయిత కోన వెంకట్‌ మాట్లాడుతూ- 'నేను రాసిన 'ఢీ' తర్వాత నాకు బాగానచ్చిన చిత్రం 'డాన్‌ శీను'. పేరు శీను... కావాలనుకుంటాడు డాన్‌... అతను అమితాబ్‌కి పెద్ద ఫ్యాన్‌. అన్నివర్గాలవారినీ ఆనందపరిచే హీరో రవితేజ 'డాన్‌ శీను'గా చేస్తున్న ఈ చిత్రంలో శ్రీహరి మంచి పవర్‌ఫుల్‌ పాత్ర పోషిస్తున్నారని అన్నారు. మణిశర్మ సంగీతం, సమీర్‌రెడ్డి ఫొటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి సహ నిర్మాత : సురేష్‌రెడ్డి, నిర్మాత వెంకట్‌.

 
 

Copy right reserved for www.cinevinodam.com 2005