Bookmark and Share   Cinevinodam
Subscribe
 
 
‘డాన్ శీను’ పెద్ద హిట్ : కె.అచ్చిరెడ్డి

      క్రేజీస్టార్ రవితేజ హీరోగా కె.అచ్చిరెడ్డి సమర్పణలో ఆర్.ఆర్.మూవీ మేకర్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత వెంకట్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నిర్మించిన ‘డాన్ శీను’ అన్ని కేంద్రాల్లో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ సందర్భంగా నిర్మాత వెంకట్ మాట్లాడుతూ- ‘కిక్ తర్వాత మా బ్యానర్లో వచ్చిన మరో సూపర్ డూపర్ మెగా హిట్ ‘డాన్ శీను’. ఈ చిత్రాన్ని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు ఆర్.ఆర్.మూవీ మేకర్స్ సంస్థ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’ అన్నారు.

సమర్పకులు కె.అచ్చిరెడ్డి మాట్లాడుతూ- ‘‘డాన్ శీను’ మొదటి వారం రోజుల్లోనే రూ.13,47,29,586ల షేర్ సాధించి రవితేజ చిత్రాల్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి, మా ఆర్.ఆర్. మూవీమేకర్స్ కు మరో మెగా హిట్ అయ్యింది’ అన్నారు.

సహ నిర్మాత వి.సురేష్ రెడ్డి మాట్లాడుతూ- ‘‘కిక్’ కంటే ‘డాన్ శీను’కు ఫస్ట్ వీక్ ఎక్కువ షేర్ వచ్చింది. సెకండ్ వీక్ కూడా కలెక్షన్స్ బ్రహ్మాండంగా వున్నాయి. రెండోవారంలో ఫ్యామిలీఆడియన్స్ బాగా పెరిగినందు వలన ‘డాన్ శీను’ చాలా పెద్ద రేంజ్ కు వెళ్తోంది’ అన్నారు.

దర్శకుడు గోపీచంద్ మలినేని మాట్లాడుతూ- ‘‘డాన్ శీను’ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చిన వెంకట్ కు, రవితేజకు కృతజ్ఞతలు. ‘డాన్ శీను’ను ాదరించి అద్భుత విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు’ అన్నారు.

 
 

Copy right reserved for www.cinevinodam.com 2005