మసాలా
 
 
 
 
ముగిసిన గోవా ఫిలిం ఫెస్టివల్‌
గోవాలో సినిమా పండుగ ముగిసింది.మన దేశంలో 42వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం అత్యుత్తమ చిత్రానికి అందించే గోల్డెన్‌ పీకాక్‌ అవార్డును ‘కోలంబియా సినిమా ‘ఫోర్‌ ఫిరియో’ గెలుచుకుంది.ఈ చిత్రానికి అలెగ్జాండ్రో లాండస్‌ దర్శకత్వం వహించగా,ఫ్రాన్సికో అల్‌జ్యురె దీన్ని నిర్మించారు.సిల్వర్‌ పీకాక్‌ అవార్డును ‘నాడెర్‌ అండ్‌ సిమిన్‌, ఎ సెవరేషన్‌’ చిత్రానికి లభించింది. అత్యుత్తమ దర్శకుడికి ఇచ్చే సిల్వర్‌ పికాక్‌ అవార్డును ఈ చిత్ర దర్శకుడు ఆస్గార్‌ ఫర్హాది తీసుకున్నారు.

భారతీయ చలన చిత్ర ప్రముఖులు సురియా, ఇర్ఫాన్‌ ఖాన్‌, కంగ్నా రనౌత్‌, సోహెల్‌ ఖాన్‌, నీలమ్‌,భూమికా చావ్లా , మధు అంబట్‌లతో పాటు అంతర్జాతీయ సినీ ప్రముఖుల లక్‌ బెసన్‌,మైఖేల్‌ యే తదితరులు ఈ చిత్రోత్సవానికి హాజరయ్యారు. ప్రఖ్యాత ఫ్రెంచ్‌ దర్శకుడు తెరకెక్కించిన ‘ది లేడి’ ప్రదర్శనతో ఈ చిత్రోత్సవం ముగిసింది.సమాచార,ప్రసార శాఖ మంత్రి చౌదరి మోహన్‌ జట్వా ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘ భారతీయ సినీ ప్రతిభాపాలవాలు చాటి చెప్పేందుకు అంతర్జాతీయ చిత్రోత్సవాలు మంచి అవకాశమని, ఈ చిత్రోత్సవం విజయవంతంగా ముగిసినందుకు హర్షం వ్యక్తం చేశారు.రానున్న కాలంలో గోవాలో మరిన్ని సినిమా ఉత్సవాలు జరగాలని అకాంక్షించారు. పదకొండు రోజుల పాటు జరిగిన ఈ చిత్రోత్సవాలలో 65 దేశాలకు చెందిన 100కు పైగా చిత్రాలను 8 స్క్రీన్‌లపై ప్రదర్శించారు.