Bookmark and Share   Cinevinodam
Subscribe
 
 
తొలి శృంగార సన్నివేశంలో ఫ్రిదా

     ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ ఫేమ్ ఫ్రిదా పింటో తొలిసారిగా సెక్స్ సన్నివేశంలో నటించింది. గ్రీకు పురాణ గాథను అనుసరించి తెరకెక్కుతున్న ఈ చిత్రం పేరు ‘ఇమ్మోర్టల్’. ఈ చిత్రంలో పూర్తి నగ్నంగా నటించాల్సిన సన్నివేశంతోపాటు హీరోతో సెక్స్ లో పాల్గొన్నట్టు నటించాల్సిన సన్నివేశాలు రెండు మూడు వున్నట్లు దర్శకుడు తర్సెమ్ సింగ్ వెల్లడించారు. ఫ్రిదాకు సెక్స్ సీన్ లో నటించడం తొలిసారి కావడంతో ఆమె తెగ సిగ్గుపడిపోయినట్టు దర్శకుడు చెప్పుకొచ్చడు. దీంతో సెక్స్ సీన్ చిత్రీకరిస్తున్న గదిలో వున్న లైట్లను స్విఛ్చాఫ్ చేసి కేవలం ఒకే ఒక్క లైటు వెలుతురులో ఫ్రిదాపై సెక్స్ సన్నివేశాన్ని చిత్రీకరించినట్లు వెల్లడించారు. తొలుత సెక్స్ సన్నివేశంలో నటించేందుకు సిగ్గుపడినా ఆ తర్వాత పలు రిహార్సల్స్ తర్వాత ఫ్రిదా అద్భుతంగా నటించిందని చెప్పుకొచ్చాడు. అయితే సెక్స్ సన్నివేశాలు హాలీవుడ్ చిత్రాల యూనిట్ సభ్యులకు అతిసామాన్యమైనవి కావడంతో ఆ సన్నివేశాన్ని చిత్రీకరించేటప్పుడు ఫ్రిదా చుట్టూ కనీసం ఓ వందమంది యూనిట్ సభ్యులున్నారట. దీంతో అమ్మడు వారి ముందు నగ్నంగా సెక్స్ సీన్లో నటించేందుకు ససేమిరా అని భీష్మించుకు కూర్చుందట. దీంతో దర్శకుడు 20మందికి అనుమతినిచ్చి మిగిలిన సభ్యుల్ని మానిటర్లో సెక్స్ సన్నివేశం ఎలా వస్తుందో గమనించమని బయటకు పంపేశాడట. ఆ 20మంది సభ్యులకు కూడా తన శరీరాన్ని పూర్తిగా చూపేందుకు ఫ్రిదా ఇష్టపడకపోవడంతో దర్శకుడు చేసేదిలేక దీపపు కాంతిని తగ్గించి మసకమసక వెలుతురులో సెక్స్ సీన్ లాగించేశాడట.

 
 

Copy right reserved for www.cinevinodam.com 2005