Bookmark and Share   Cinevinodam
Subscribe
 
 
పూజారిణిగా ఫ్రీదాపింటో

      ఓ సినిమా హిట్‌ అయితే హీరోయిన్‌ గ్లామర్‌తో సంబంధం లేకుండా సినిమా ఆఫర్లు ఆవే వస్తాయి. అందు ఉదాహరణగా స్లమ్‌డాగ్‌ హీరోయిన్‌ ఫ్రీదాపింటోని చెప్పుకోవచ్చు. సెలెబ్రిటీ ఫిజిక్‌ లేకపోయినా..అందం కరువైనా... ఒక్క సినిమా హిట్‌తో ఆమె అందలమెక్కేసింది. స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌ సినిమా ఇచ్చిన హిట్‌తో పింటో వరల్డ్‌ సెలెబ్రిటీ అయిపోయింది. ఆమె ఎక్కడకి వెళ్లినా అందరూ రెడ్‌ కార్పెట్‌ వెల్‌కమ్‌ చెబుతున్నారు. ఇటీవల ఆమె ఏకంగా ప్రపంచస్థాయి సెలెబ్రిటీలో వంద మంది అత్యంత పవర్‌ఫుల్‌ ఉమెన్స్‌ జాబితాలో పేరు సంపాదించుకోవడం విశేషం. స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌ సినిమాలో ఆమె నటనకి అవార్డులు రాకపోయినా .. ఆమెకి పేరు మాత్రం అనుకున్న దానికంటే ఎక్కువే వచ్చింది. ముఖ్యంగా బ్రిటీష్‌ దేశంలో ఆమె పేరు మార్మోగిపోతోంది. మోడల్‌గా కెరీర్‌ని ప్రారంభించి ... ఆ తరవాత సినీ ఎంట్రీ ఇచ్చిన ఫ్రీదా పింటో ఇప్పుడు గ్రీకు పురాణం ఆధారంగా నిర్మించే ఓ హాలీవుడ్‌ చిత్రంలో నటించబోతుంది. వార్‌ ఆఫ్‌ ది గాడ్స్‌ పేరుతో నిర్మిస్తున్న ఈ సినిమాకి దర్శకుడు తాసెమ్‌ సింగ్‌.

దీని నిర్మాణం ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభమవుతుంది. యుద్ధవీరుని జీవిత కథాంశంగా రూపొందే ఈ సినిమాలో ఆమె పాత్రపేరు ఫెద్రా. 25 సంవత్సరాల పింటో ఈ చిత్రంలో మహిమ గల గ్రీకు పుజారిణిగా కనిపించబోతోంది. ఈ సినిమాని హాలీవుడ్‌కి చెందిన ఓ ప్రొడక్షన్‌ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లేని హర్లే, వా, జాసన్‌ కెల్లర్‌ అందిస్తున్నారు. ఎంతైనా లతికకు లక్‌ ఉందని ఈ సినిమా ద్వారా నిరూపణ అయింది.

 
 

Copy right reserved for www.cinevinodam.com 2005