మసాలా
 
 
 
 
ఇంటీరియర్‌ డిజైనర్‌గా షారుఖ్ భార్య గౌరీ
బాలీవుడ్‌లో కింగ్‌ ఖాన్‌ షారూఖ్‌ ఖాన్‌ సతీమణి గౌరీఖాన్‌ ఇటీవల తన భర్త బ్యానర్‌పై ప్రొడ్యూసర్‌ గా పలు సినిమాలను రూపొందించారు. దీంతో స్టార్‌ ప్రొడ్యూసర్‌గా ఆమె పేరు తెచ్చుకున్నారు. ఆమె అంతటితో ఊరుకోకుండా ఇంటీరియర్‌ డిజైనర్‌గా కొత్త అవతారం ఎత్తడం విశేషం.డిజైనర్‌గా మరింత పాపులారిటీ సంపాదించాలని ఆశిస్తూ గౌరీఖాన్‌ ఎంతో కృషిచేస్తున్నారు.

పలువురు హాలీవుడ్‌ సెలబ్రిటీలు ఫ్యాషన్‌ డిజైనర్లుగా రాణిస్తుండడం తెలిసిందే. కానీ మన దేశంలో ఇటువంటి సెలబ్రిటీలు చాలా తక్కువమంది కనిపిస్తారు. కానీ బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ షారూఖ్‌ఖాన్‌ సతీమణి గౌరీ ఖాన్‌ మాత్రం ఇంటీరియర్‌ డిజైనర్‌గా కొత్త జీవితాన్ని ప్రారంభించడం విశేషం. ఇదివరకే స్టార్‌ ప్రొడ్యూసర్‌గా పేరు తెచ్చుకున్న ఆమె ఇంటీరియర్‌ డిజైనర్‌గా రాణించేందుకు ఎంతో కృషిచేస్తున్నారు.

బాలీవుడ్‌ స్టార్‌ హృతిక రోషన్‌ సతీమణి అయిన ప్రముఖ ఇంటీరియర్‌ డిజైనర్‌ సుసానె రోషన్‌కు మంచి స్నేహితురాలు గౌరీ ఖాన్‌. సుసానె ఎన్నో సంవత్సరాలు గా ఇంటీరియర్‌ డిజైనర్‌గా చేస్తూ పాపులారిటీ సంపాదించుకున్నారు. ఆమె బాలీవుడ్‌ స్టార్లు రాణి ముఖర్జీ, శిల్పా శెట్టి, ప్రియాంకా చోప్రా, షాహిద్‌ కపూర్‌ వంటి వారి ఇళ్లకు ఇంటీరియర్‌ డిజైన్లను రూపొందించారు. సుసానె ఇటీవల ముంబయ్‌లో మరో కొత్త ఇంటీరియర్‌ స్టోర్‌ను కూడా ప్రారంభించారు. ప్రస్తుతం సుసానెతో గౌరీఖాన్‌ చేతులు కలిపి ప్రతిష్టాత్మకమైన పెద్ద ఇం టీరియర్స్‌ ప్రాజెక్టులలో కలిసి పనిచేస్తుండడం విశేషం.

సుసానె ఇంటీరియర్‌ స్టోర్‌లో భాగస్వామిగా కాకుండా కేవలం కొన్ని పెద్ద ఇంటీరియర్‌ ప్రాజెక్టుల్లో మాత్రమే వారిద్దరూ కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు. ఇక తన సతీమణి స్టార్‌ ప్రొడ్యూసర్‌గా నిలిచిన తర్వాత ఇంటీరియ ర్‌ డిజైనర్‌గా అవతారం ఎత్తడం పట్ల షారూఖ్‌ ఖాన్‌ ఎంతో సంతోషంగా ఉన్నారు. తన భార్య ప్రతిభకు ఆయన ముగ్దులవుతున్నారు. ఇంటీరియర్‌ డిజైనర్‌గా రాణించేందుకు ఆమెను ఎంతో ప్రోత్సహిస్తున్నారు. అవస రమైన సహాయ, సహకారాలను అందిస్తున్నారు. ‘ఇంటీరియర్‌ డిజైనర్‌గా రాణించేందుకు ఎంతో కృషిచేస్తున్నాను.

నా మిత్రురాలు సుసానెతో కలి సి పలు పెద్ద ఇంటీరియర్‌ ప్రాజెక్టులను చేస్తున్నాను. ఇక షారూఖ్‌ నన్ను అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నారు. డిజైనింగ్‌లో నాకు పలు సూచనలు, సలహాలను కూడా ఇస్తున్నారు. నా పనులకు ఆటంకం కలగకుండా కొన్నిసార్లు పిల్లల అవసరాలను కూడా ఆయనే చూసుకుంటుండడం నాకెంతో సంతోషం కలిగిస్తోంది’ అని గౌరీఖాన్‌ పేర్కొన్నారు.