Bookmark and Share   Cinevinodam
Subscribe
 
 
జెనీలియా ప్రేమ"కథ"

     ‘బొమ్మరిల్లు’, ‘ఢీ’, ‘రెడీ’ చిత్రాల తర్వాత జెనీలియాకు తెలుగులో విజయం దక్కనంటోంది. జెనీలియా నటించిన ‘శశిరేఖా పరిణయం’తోపాటు, తాజా చిత్రం ‘కథ’ కూడా విజయమనే కంచికి చేరనంటుండడం తెలిసిందే. హిందీలోనూ ‘జానే తు యా జానేనా’ తర్వాత ఆమెకు హిట్‌ దక్కలేదు. ఈనేపధ్యంలో ఆమె తన చిరకాల ప్రియుడు రితేష్‌ దేశ్‌ముఖ్‌ను పెళ్లాడి, గృహిణిగా మారిపోవాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మహారాష్ర్ట మాజీ ముఖ్యమంత్రి తనయుడైన రితేష్‌ దేశ్‌ముఖ్‌తో ఒకటిరెండు చిత్రాల్లో కలిసి నటించిన జెనీలియా అప్పటినుంచి అతనితో ‘స్నేహసంబంధాలు’ కొనసాగిస్తోంది. రితేష్‌ కుటుంబ సభ్యులు కూడా జెనీలియాను ఆమోదించారని, రాజకీయంగా శక్తివంతమైన కుటుంబ నేపధ్యం కలిగిన రితేష్‌తో వివాహానికి జెనీలియా ఫ్యామిలీ మెంబర్స్‌ కూడా ఆనందంతో అంగీకరించారని తెలుస్తోంది!

 
 

Copy right reserved for www.cinevinodam.com 2005