''జనం గుర్తుపడతారు... మన ఆనందం దూరమవుతుందనే భయం నాకు
లేదు. జనం మధ్యకు వెళ్లడాన్ని కూడా సరదాగానే తీసుకొంటాను. వారు నన్ను
పేరు పెట్టి పిలుస్తుంటే తిరిగి వారికి 'హాయ్' అని సమాధానం కూడా ఇస్తాను.
గట్టిగా అరుస్తూ సమాధానం చెబుతాను. కొన్నిసార్లు ఇది తికమకగా అనిపించొచ్చు.
నా పిచ్చి పనులు చూసి కొందరు నన్ను పిచ్చిది అని కూడా అంటారు. అవును నేను
పిచ్చి పిల్లనే!''
''ఈ సినీ జీవితంలో నేనెప్పుడూ పూర్తి సంతృప్తిని పొందలేదు. ఒక్కోసారి ఘన
విజయాల్ని అందుకొన్నాను. మరుక్షణమే అపజయాల్ని మూటగట్టుకొంటున్నాను.
అయితే పని లేకుండా ఏ రోజూ లేను. జయాపజయాలనే ఎత్తుపల్లాలు చూశాను.
అయితే నాకు కలిసి రాని రోజులు చాలానే నేర్పాయి. నేను అదృష్టవంతురాల్ని.
ఎందుకంటే హిందీ, తమిళం, తెలుగు, మలయాళం అనే బేధం లేకుండా
అందరు ప్రేక్షకులు ఆదరించారు''.
''ముంబయిలోనే పెరిగాను. ఆటలంటే చాలా ఇష్టం. బాస్కెట్ బాల్ నుంచి
హాకీ వరకూ అన్నీ ఆడాను. జాగర్స్ పార్క్ నా జీవితంలో ఓ భాగమై ఉండేది.
ఎక్కువగా అక్కడే శిక్షణ ఉండేది. నేను రాష్ట్రస్థాయి అథ్లెట్ అన్న విషయం చాలా
మందికి తెలియదు''.
''జీవితాన్ని ఆనందంగా గడపటానికే ఎక్కువ ప్రాధాన్యమిచ్చే వ్యక్తిని నేను.
ఎప్పుడూ చలాకీగా ఉండటానికే ఇష్టపడతాను. నా కాలేజీ రోజుల్లో కూడా నేను
ఎక్కువగా ముంబయిలోని కార్టర్ రోడ్‌లోని కాఫీ డేలోనే ఎక్కువగా ఉండేదాన్ని.
ఇప్పుడు సినిమా నాయికను అన్న భావన ఏ కోశానా లేదు. అప్పట్లో ఎలాంటి
జీవనశైలి ఉండేదో ఇప్పుడూ అదే కొనసాగిస్తున్నాను. కాకపోతే ఊపిరి సలపని
చిత్రీకరణలతో కొంచెం ఆనందాన్ని త్యాగం చేయాల్సి వస్తోంది''.
|