నాలుగేళ్ళ చిరు ప్రాయంలోనే ‘హనుమాన్ చాలీసా’ను ఆలపించి ప్రథమ బహుమతి కైవసం చేసుకున్న రాజీవ్... నాటి నుంచి నేటి వరకూ తన
స్వరామృతాన్ని పంపుతూ... సర్వసారథిగా మారారు. ప్రముఖ మల్టీ నేషన్ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్ హోదాలో అమెరికాలో పనిచేస్తున్న రాజీవ్ తొలుత
‘తూ హీ తూ’ అనే పేరుతో స్వీయ సంగీత సారథ్యంలో హిందీలో ఆల్బమ్ రూపొందించారు. తర్వాత తెలుగులో ‘చెలియా’ పేరుతో రూపొందించిన
ఆల్బమ్ ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. తెలుగు భాషపై మమకారంతో అమెరికాలో జరిగే పలు తెలుగు సాంస్కృతిక కార్యక్రమాల్లో క్రియాశీలక
పాత్రను పోషించేవారు. తెలుగు సినిమాలకు తన గానాన్ని అందిస్తూ సంగీత దర్శకత్వం కూడా చేయాలనే లక్ష్యంతో సాగుతున్నారు.
ఆయన చేసిన ‘గోవింద గానామృతం’ ఆల్బమ్ ఆవిష్కరణ ఈ రోజు హైదరాబాద్లో జరిగింది. ఈ కార్యక్రమంలో దిల్ రాజు, మధుర శ్రీధర్, వి.ఎన్.ఆదిత్య,
సిరాశ్రీ, రాజీవ్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. రాజీవ్ కుటుంబ సభ్యులు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా, దిల్ రాజు ఆల్బమ్ ను
ఆవిష్కరించారు. తొలి సీడిని వి.ఎన్.ఆదిత్య స్వీకరించారు.
ఈ సందర్భంగా రాజీవ్ మాట్లాడుతూ- ‘6నెలల క్రితం వెంకటేశ్వరుని ఆల్బమ్ చేయాలనే ఆలోచన వచ్చింది. వెంటనే నా శ్రేయోభిలాషి మధుర శ్రీధర్ కి చెప్పాను. ఆయన సిరాశ్రీని పరిచయం చేసి ఈ ఆల్బమ్ పూర్తి కావడానికి ఎనలేని సహాయం చేశారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఈ ఆల్బమ్ విడుదల చేయడం చాలా ఆనందంగా వుంది’ అన్నారు.
దిల్ రాజు మాట్లాడుతూ- ‘ఈ పవిత్ర వైకుంఠ ఏకాదశి పర్వదినాన గోవింద గానామృతాన్ని ఆవిష్కరించడం రాజీవ్ కి చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మూడు రోజులుగా నేను ఆ పాటలు వింటున్నా... చాలా బాగున్నాయి. దైవత్వంగా భావించే ప్రతి ఒక్కరూ ఇలాంటి భక్తి పాటలను ప్రోత్సహించాలని ఆశిస్తున్నాను’ అన్నారు.
వి.ఎన్.ఆదిత్య మాట్లాడుతూ- ‘లక్ష్మీ హ్యాండ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారి చేతుల మీదుగా ఈ ఆవిష్కరణ జరగడం చాలా ానందంగావుంది’ అన్నారు. మధుర శ్రీధర్ మాట్లాడుతూ- ‘అమెరికాలో వృత్తిని నిర్వహిస్తున్న రాజీవ్ ఒక రోజు ఫోన్ చేసి వెంకటేశ్వరునిపై ఆల్బమ్ చేయాలనుకుంటున్నాను అన్నారు. తర్వాత నేను లిరిక్ రైటర్ సిరాశ్రీని పరిచయం చేయడం జరిగింది. రాజీవ్ పంపిన ట్యూన్స్ కి సిరాశ్రీ లిరిక్స్ సమకూర్చారు. ఈ ఆల్బమ్ కి ఒకవీడియో కూడా వుంటే బాగుంటుందని అనగానే నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ సభ్యలు వీడియోని చిత్రించి ఎడిటింగ్ చేసి అంతా సిద్ధం చేశారు. ఇంత మంచి రోజున ‘గోవింద గానామృతాన్ని’ ఆవిష్కరించడం చాలా ఆనందంగా వుంది’ అన్నారు.
సిరాశ్రీ మాట్లాడుతూ- ‘మొదటిసాి దేవునిపై ఆల్బమ్ కి నేను లిరిక్స్ రాయడం చాలా ఆనందంగావుంది. రాజీవ్ మ్యూజిక్ కంపోజింగ్ చాలా బాగుంది. పాటలన్నీ బాగా వచ్చాయి’ అన్నారు.
ఈ ఆల్బమ్ కి రచన : సిరాశ్రీ, సంగీతం : రాజీవ్, గానం: ఎస్పీ బాలు, రాజీవ్, సునీత, అనితాకృష్ణ, నిత్య సంతోషిణి, సమర్పణ : లాస్య ఎంటర్టైన్మెంట్స్, మధుర ఆడియో ద్వారా సిడీలు మార్కెట్లో లభిస్తున్నాయి.