గ్రీకువీరుడు నాగార్జున కామాక్షి కళా మూవీస్ పతాకంపై అగ్రనిర్మాత డి.శివప్రసాదరెడ్డి కిరణ్ దర్శకత్వంలో నిర్మిస్తున్న భారీ చిత్రం ‘కేడి’. ఈ చిత్రం షూటింగ్ నిమిత్తం గ్రీస్ కి వచ్చిన గ్రీకువీరుడు నాగార్జునకు గ్రీక్ ప్రభుత్వం, మిలోస్ ఐలాండ్ ప్రతినిధులు, ప్రెస్ మీడియా స్వాగతం చెప్పి, ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా మిలోస్ ఐలాండ్లో జరిగిన సత్కార సభలో గ్రీక్ ప్రభుత్వ ప్రతినిధులు మాట్లాడుతూ- ‘నాగార్జున రాక గ్రీక్ టూరిజం డిపార్ట్ మెంట్ కి గొప్పదినంగా భావిస్తున్నాం. నాగార్జున ఇక్కడ షూటింగ్కి రావడం మేము గర్వంగా ఫీలవుతున్నాం.ఈ సందర్భంగా నాగార్జునను సత్కరించడం మా అదృష్టం. ఈ అవకాశాన్ని మాకిచ్చిన కామాక్షి కళా మూవీస్, అన్నపూర్ణ స్టూడియోస్ టీమ్కి మా ధన్యవాదాలు. మళ్ళీ మళ్ళీ గ్రీకువీరుడు నాగార్జున మా గ్రీస్ కి రావాలని కోరుకుంటున్నాం’ అన్నారు.
నాగార్జున మాట్లాడుతూ- ‘గ్రీస్ లో షూటింగ్ చెయ్యడం సంతోషంగా వుంది. అన్ని విధాలా సహకారాన్ని అందిస్తున్న గ్రీక్ గవర్నమెంట్కు, గ్రీక్ టూరిజం డిపార్ట్ మెంట్ కి ధన్యవాదాలు’ అన్నారు. నిర్మాత డి.శివప్రసాదరెడ్డి మాట్లాడుతూ- ‘మనం గ్రీకువీరుడు అని ముద్దుగా పిలుచుకునే నాగార్జునను గ్రీకు దేశం తమ రాజకుమారుడిలా గౌరవించి ఘనంగా సత్కరించడం చాలా ఆనందంగా వుంది’ అన్నారు.
డిసెంబర్ 11వరకు గ్రీస్ లో ఈ షూటింగ్ జరిగే ఈ చిత్రంలో కింగ్ నాగార్జున, మమతా మోహన్ దాస్ లపై ‘కేడి’ చిత్రం కోసం గ్రీస్ లో పాట చిత్రీకరిస్తున్నారు. జనవరి రెండో వారంలో సంక్రాంతి కానుకగా విడుదలయ్యే ఈ చిత్రంలో ‘కింగ్’ నాగార్జున, మమతా మోహన్ దాస్, అమెరికా అమ్మాయి లిండా ఓ ముఖ్యపాత్రను చేస్తోంది. ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ ఫేం అంకుర్, ‘బండిట్ క్వీన్’ ఫేం నిర్మల్ పాండే, ‘లగాన్’ ఫేం అఖిలేంద్ర మిశ్రా, ‘డాన్’ మిలన్ కెల్లీడార్జ్, షయ్యాజీ షిండే, బ్రహ్మానందం, హర్షవర్థన్, తనికెళ్ళ భరణి ముఖ్యపాత్రలు పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో కామాక్షి కళామూవీస్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం : సందీప్ చౌతా, ఫొటోగ్రఫీ: సర్వేష్ మురారి, పాటలు: చంద్రబోస్, కృష్ణచైతన్య, ఫైట్స్: సెల్వ, ఎడిటింగ్: శ్రవణ్, ఆర్ట్: శ్రీకాంత్, మూర్తి, మేకప్: చంద్ర, స్టిల్స్: రఘు, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: కుమార్, నిర్వహణ: చెంచురెడ్డి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : అక్కినేని వెంకటరత్నం, నిర్మాత : డి.శివప్రసాదరెడ్డి, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: కిరణ్.
|