Bookmark and Share   Cinevinodam
Subscribe
 
 
హన్సిక జాగ్రత్తపడుతోంది!

     యాపిల్‌ని చూడగానే ఎవరికైనా ఏం అనిపిస్తుందో... హన్సికను చూడగానే అదే ఫీలింగ్‌ కలుగుతుంది. 'క్షణకాలం కన్నార్పితే... ఆ చిన్న వ్యవధిలో కూడా ఆ అందానికి దూరమవ్వడం బహుకష్టం' అనిపించేంత అద్భుత సౌందర్యం హన్సిక సొంతం. అందం ఉన్న చోటే సంస్కారం కూడా ఉంటుంది అంటారు. అది అక్షర సత్యం అని హన్సిక దగ్గరగా చూసిన ఎవరైనా ఒప్పుకుంటారు. 'ప్రవర్తన' అనే అంశం గురించి ఓ సందర్భంలో హన్సిక మాట్లాడుతూ- "మంచితనం అంతకంతకూ పరిమళిస్తుందని అమ్మ చెబుతూ ఉండేది. ఆ మాటను నరనరాల్లోకీ జీర్ణించుకున్నాను.

పెద్దా చిన్నా తారతమ్యం లేకుండా అందిరితో నేను మంచిగా ఉండటానికి కారణం ఇదే. అమ్మచెప్పిన ఆ మాట నా కెరీర్‌కు కూడా ఎంతో ఉపకరించింది. అమ్మ ఇంకో మాట కూడా చెబుతుండేది. 'నిన్ను ఎవరైనా సహాయం కోరితే... నీకది సాధ్యమైతే చేయ్‌... అంతేకానీ వాళ్లను తక్కువగా చూడొద్దు. చులకన చేసి మాట్లాడొద్దు' అని చెప్పింది. అంతేకాదు చేసే పనిలో దైవాన్ని చూడమని కూడా అమ్మే చెప్పింది. అందుకే నా జీవన ప్రయాణంలో ఆదర్శం మార్గదర్శి అమ్మే.' అని చెప్పుకొచ్చారు హన్సిక.

ఈ మధ్య కెరీర్‌ కాస్త నెమ్మదించినట్టుంది? అన్న ప్రశ్నను ఈ చిన్నదాని ముందుంచితే.. "తొందరపడి తీసుకున్న నిర్ణయాల వల్ల కొంత నష్టపోయిన మాట నిజం. అందుకే ఇక నుంచి కెరీర్‌ జాగ్రత్తగా ప్లాన్‌ చేసుకుంటున్నా. కథతో పాటు హీరో, బ్యానర్‌ ఇత్యాది అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని సినిమాను అంగీకరిస్తా. కథానాయికగా నాకు తొలి బ్రేక్‌ ఇచ్చిందీ... నన్ను ఈ స్థాయికి తెచ్చిందీ తెలుగు సినిమానే. అందుకే నా తొలి ప్రాధాన్యత తెలుగు సినిమాకే. మళ్లీ ఓ ట్రెమండస్‌ మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకుకొస్తా 'అని చెప్పారు హన్సిక. ప్రస్తుతం ఓ రెండు తమిళ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు హన్సిక.

 
 

Copy right reserved for www.cinevinodam.com 2005