Bookmark and Share   Cinevinodam
Subscribe
 
 
క్రికెటర్ తో హన్సిక ప్రేమ

      బాలీవుడ్‌లో ప్రస్తుతం హన్సిక రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. బాలీవుడ్‌లో ప్రస్తుతం హన్సిక రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. "ఏ పాత్ర పడితే అది చేయడానికి ఇష్టపడని నేను ఈ చిత్రకథలు, నా పాత్ర గురించి వినగానే ఒప్పేసుకున్నాను' అంటున్నారు హన్సిక. 'మై ఔర్‌ మేరా హిమ్మత్‌' అనే చిత్రంలో పాకిస్తాన్‌ క్రికెట్‌ క్రీడాకారుడు షోయబ్‌ అక్తర్‌ సరసన నటిస్తున్నారామె. టూర్‌ నిమిత్తం ఇండియా వచ్చే షోయబ్‌ అక్తర్‌ భారతీయ వనిత అయిన హన్సిక మీద మనసు పారేసుకుంటారు. అతగాడి మీద హన్సికకి కూడా ప్రేమ పుడుతుంది.

ఇదొక క్యూట్‌ లవ్‌స్టోరి అని సమాచారం. ఈ చిత్రంలో సాదాసీదా పంజాబీ యువతిగా నటిస్తున్నారు హన్సిక. ఈ పాత్ర పోషించడానికి పంజాబీ అమ్మాయిల వేషధారణ, ప్రవర్తించే తీరుని గమనించానని హన్సిక అంటున్నారు. ఇక, మరో సినిమాలో ఎన్నారై గాళ్‌గా నటిస్తున్నారు. అల్లారు ముద్దుగా పెంచిన తండ్రి చనిపోయిన తరుణంలో వ్యాపారాలు చూసుకోవడానికి విదేశాల నుంచి ఢిల్లీకి వచ్చే అమ్మాయిగా నటించారు హన్సిక. వ్యాపారంలో తలమునకలై ఉన్న ఆమె ఓ అనాథతో ప్రేమలో పడతారు. అక్కడ్నుంచీ ఈ కథ పలు మలుపులు తిరుగుతుందట. ఒక సినిమాలో సాదాసీదా అమ్మాయిగా, మరో సినిమాలో ధనవంతురాలిగా నటించడం మంచి అనుభూతినిస్తోందని హన్సిక అంటున్నారు. పంజాబీ యువతి పాత్ర కోసం లంగా ఓణీలు కట్టుకుంటే, ధనవంతురాలి బిడ్డగా మోడ్రన్‌ డ్రెస్‌లు వేసుకుంటున్నారామె. వస్త్రధారణ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నానని హన్సిక అన్నారు.

 
 

Copy right reserved for www.cinevinodam.com 2005