‘దేశముదురు’తో తెలుగు తెరకు పరిచయమైన ముంబై భామ హన్సిక. తొలి సినిమాలో ఈ సుందరి
నాజూకుగా కనిపించినా రోజు రోజుకి బొద్దుగా తయారవుతుండడం, నిర్మాతల పట్ల నిర్లక్ష్య ధోరణితో
వ్యవహరించడం.. తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం పెద్ద చర్చగా మారింది. బొద్దందానికి అరవ
తంబిలైతే గుడి కడతారేమో గానీ తెలుగు ప్రేక్షకుడికి మాత్రం అస్సలు రుచించదు. తమ నాయిక
సన్నజాజి తీగలా ఉండాలనేది కోరిక. ఆకృతిలో మితిమీరిన ఈ బొద్దు సుందరి..సరైన మార్గదర్శకత్వం
లేక.. ఇటీవల నిర్మాతలతోనూ సఖ్యంగా వ్యవహరిం చలేదనేది విశ్వసనీయంగా తెలుస్తోంది. ఇటీవల
కాలంలో నారా రోహిత్‌తో సినిమాకి ఎంపికైన ఈ భామ సదరు నిర్మాతలను కోటి డిమాండ్ చేసిందని,
తన ప్రవర్తనతో విసుగెత్తిన నిర్మాతలు ఆ తర్వాత ప్లాన్‌ని మార్చుకుని రానాతో ప్రాజెక్ట్
ప్రారంభించి..హన్సిక బదులుగా జెనీలియాను నాయికగా ఎంపిక చేసుకున్న విషయం తెలిసిందే.
అదేగాక ‘కందిరీగ’ నిర్మాత బెల్లంకొండ సురేష్‌ను సైతం చిత్రీకరణ సమయంలో.. ఈ అమ్మడు ఎన్నో
ఇబ్బందులకు గురిచేసిందని కూడా తెలుస్తోంది. కేవలం రూ.5లక్షల రెమ్యునరేషన్‌తో కన్నడ హీరో
పునీత్ రాజ్‌కుమార్ సరసన నటించిన ఈ భామ.. ప్రస్తుతం కోటికి పడగెత్తడం.. బయానా విషయంలో
ఏమాత్రం తగ్గకపోవడం కొందరికి చిర్రెత్తేలా చేస్తోందని వార్తలొస్తున్నాయి. హన్సిక ప్రవర్తనపై ఇటీవల
నిర్మాతల మండలికి సైతం కొన్ని ఫిర్యాదులందాయి. ఇంత వరకూ ఓ పెద్ద హీరోతో నటించే అవకాశం
చిక్కని హన్సిక ఇకనైనా.. మారకపోతే.. తెలుగునాట అవకాశాలు దక్కడం కష్టమేనని ప్రస్తుతం
ఫిలింనగర్‌లో చర్చ నడుస్తోంది! ఇలా అయితే చివరికి హన్సిక సెకండ్ హీరోయన్‌గానీ, బిల్లా తరహాలో
ఐటం పాటలకు కానీ లేదా ఆంటీ పాత్రలకు కానీ పరిమితం కావాలిసిందే అంటున్నారు.
|