సినిమా అనే పదం ఎలా వచ్చింది? ఇండియాలో సినిమా ఎలా పుట్టింది. భారతీయ సినిమా గొప్పగా చెప్పుకునే దాదా సాహెబ్ ఫాల్కే ఎవరు? అతని ప్రయత్నం వల్ల ఎలా సినిమా పుట్టిందో తెలియజెప్పే కథాంశమే ఈ చిత్రం. ఈ చిత్రానికి దర్శకుడు పరేష్ మొకాషీ.
ఫాల్కే తను చేసే ప్రింటింగ్ బిజినెస్ ను మాని, కష్టాలకులోనై, అప్పుల పాలైనా విసుగు చెందక టెంట్ థియేటర్లలో సినిమాను ప్రదర్శించే ప్రయత్నం చేసి తర్వాత అప్పులు చేసి, ఉన్న వాటిని తాకట్టుపెట్టి (భార్య సహకారంతో) తను లండన్ వెళ్ళి సినిమా గురించి తెలుసుకుని కొన్ని పరికరాలను కొని ముంబాయిలో సినిమా తీయడానికి అతను చేసిన కృషి, తపన, అగచాట్లు ఈ సినిమాలో చూపారు. అతడే దర్శకుడు, నటుడు, మేకప్, కెమెరా, రచయిత 24 క్రాఫ్టులు తానే అయి చిత్ర నిర్మాణాన్ని చేశాడు. ఆయన భార్య సినిమాలో పనిచేసే నటీనటులకు సాంకేతిక నిపుణులకు వండిపెట్టడం, రాత్రులందు ఫిలిం డెవలపింగ్ చేయడం, ఆడ వేషానికి ఎవరు లేకపోతే తనే నటించడం ఇలా ఎన్నో చిత్ర విచిత్ర సంఘటనలు చిత్రీకరించారు. థియేటర్ రిలీజు, పబ్లిసిటీ, ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా చేయడం అన్నీ ఫాల్కేగారే చూసుకునేవారు.
వారి ఆనాటి ప్రయత్నమే నేటి మన సినిమా అని పరిశ్రమలోని ప్రతి వ్యక్తీ తెలుసుకోవాలి. చరిత్రను మరువకూడదు. తెలియని వాళ్ళు తెలుసుకోవాలి. రిపీట్ షో వేసినా ీ చిత్రానికి రష్ తగ్గలేదు. అంతర్జాతీయ చిత్రోత్సవం డెలిగేట్స్ నేలపై, మెట్లమీద కూర్చుని చూశారంటే అతిశయోక్తి కాదు. 90 నిమిషాల ఈ చిత్రం ఒక కనువిప్పు కావాలి. ఈ చిత్రాన్ని 8th Third Eye Asian Film Festival (Mumbai) ఆరంభ చిత్రంగా ప్రదర్శించారు.
|