మసాలా
 
 
 
 
టాప్ 10 హీరోయిన్స్
బాలీవుడ్‌లో ప్రస్తుతం టాప్‌ టెన్‌ హీరోయిన్స్‌ ఎవరు? అనేదానిపై ఇటీవల ఓ సర్వే నిర్వహించబడింది. ఆ సర్వేలో కరీనాకపూర్‌కు ప్రధమ స్థానం దక్కింది. ఎప్పుడూ ఏదో ఒక రూపంలో వార్తల్లో ఉండే కరీనా ఈ స్థానం దక్కించుకోవడంలో ఆశ్చర్యమేముంది? ఇక రెండో స్థానంలో కత్రినాకైఫ్‌ నిలవగా, మూడో స్థానం దీపిక వశమయ్యింది. ప్రియాంకచోప్రా నాలుగో స్థానంతో సరిపెట్టుకోగా, నాలుగు పదులకు చేరువవుతున్నా వన్నె తరగని అందాలతో అలరారుతున్న ఐశ్వర్యరాయ్‌ అయిదో స్థానంతో తృప్తి పడాల్సి వచ్చింది. ఇక విద్యాబాలన్‌ ఆరో స్థానంలో నిలవగా, అనుష్కశర్మ, సోనమ్‌కపూర్‌లు ఏడు, ఎనిమిది స్థానాల్లో నిలిచారు. కాగా, కంగనా, సొనాక్షిసిన్హా చిట్టచివరి తొమ్మిది, పదో స్థానాల్లో నిలిచారు. మూడో స్థానంలో నిలిచిన దీపిక, ఆరో స్థానం దక్కించుకున్న విద్యాబాలన్‌.. రజనీకాంత్‌తో ‘రాణా’ చిత్రంలో నటించనుండడం ఇక్కడ విశేషం!