Bookmark and Share   Cinevinodam
Subscribe
 
 
భారత్ పై కన్నేసిన హాలీవుడ్

     ఆర్థిక మాంద్యంతో అల్లాడుతున్న హాలీవుడ్ చిత్ర నిర్మాణానికి అవసరమైన నిధుల కోసం భారత్ పై కన్నేసింది. హాలీవుడ్ చిత్రాలకు వాల్ స్ట్రీట్ బ్యాంకులు ఆర్థిక సాయం చేయడం నిలిపివేశాయి. దీంతో ప్రైవేట్ ఈక్విటీ ద్వారా నిధులు పొందేందుకు హాలీవుడ్ భారత్ ను ఆశ్రయిస్తోంది. ఒకప్పుడు అమెరికాకు చెందిన ప్రైవేటు ఈక్విటీ ఫర్మ్ లు, బ్యాంకులు, హెడ్జ్ ఫండ్స్ లాంటివి ఒకప్పుడు హాలీవుడ్ చిత్రాలకు గణనీయంగా నిధులు సమకూర్చాయి. గత రెండేళ్ళుగా పరిస్థతి మారిపోయింది. అమెరికా సంస్థలు నేడు నిధుల కోసం భారత్ వైపు చూస్తున్నాయి. కె-19, ది విడో మేకర్, బాల్ అండ్ చెయిన్, ఎ ఫార్ట్సూన్ టెల్లర్ టోల్డ్ మి వంటి చిత్రాలను నిర్మించిన భారతీయ సంతతికి చెందిన ఏవీటీ శంకర్ దాస్ రూ.500కోట్లతో ఓ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ ను భారత్లో నెలకొల్పారు. ఈ ఫండ్ ద్వారా భారత్ నుంచి రూ.500కోట్లను సేకరించనున్నారు. ఈ మొత్తాన్ని రానున్న ఐదేళ్ళలో200 చిత్రాలకు ఆర్థిక సాయంగా అందిస్తారు. ఈ ఫండ్ లో 33 భారతీయ ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టారు.

 
 

Copy right reserved for www.cinevinodam.com 2005