హాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కు సందడి చేసే భామల సంఖ్య పెరుగుతూనే ఉంది. గతంలోనూ కొందరు హాలీవుడ్ సుందరాంగనలు తమ అందాలను ఆరబోసి బాలీవుడ్ ప్రియులను రంజింపజేశారు. ఇప్పుడు అదే కోవలో క్యాండీబూచర్ అనే ప్లేబాయ్ సౌతాఫ్రికా సుందరి ‘ఆప్కా సురూర్’ చిత్రం తీసిన దర్శకుడు ప్రశాంత్ చద్దా తీయబోయే లేటెస్ట్ చిత్రంలో తన అందాల ఆరబోతకు సిద్ధమౌతోంది. ఆర్యబబ్బర్, సచిన్‌జోషిల సరసన నటించనుంది. గతంలో హాలీవుడ్‌నుంచి బాలీవుడ్‌లో నటించిన కొందరు భామలను తీసుకుంటే అమీర్‌ఖాన్ నిర్మించిన ‘లగాన్’ చిత్రంలో రాచల్‌షెల్లీ బ్రిటీష్ దొరసానిగా నటించింది. మళ్లీ అమీర్‌ఖాన్ 2006లో నటించి, నిర్మించిన ‘రంగ్‌దే బసంతి’ చిత్రంలో ఎలైస్‌పాట్రన్ అనే బ్రిటన్ నటి అందులో నటించింది. హృతిక్‌రోషన్ సరసన ‘కైట్స్’ చిత్రంలో నటించిన బార్బారామోరి మెక్సికన్ దేశానికి చెందిన నటి. అలాగే 2009లో వచ్చిన సూపర్‌హిట్ చిత్రం ‘లవ్ ఆజ్ కల్’ చిత్రంలో బ్రెజిల్‌కు చెందిన మోడల్ జిస్సెల్లి మాంటేరియో సెకండ్ హీరోయిన్‌గా నటించి మెప్పించింది. 2006లో వచ్చిన ‘కాబూల్ ఎక్స్‌ప్రెస్’ చిత్రంలో నటించిన అమెరికన్ నటి పేరు లిండా ఆర్సెనో.అలాగే ‘కంబక్త్ ఇష్క’ చిత్రంలో అమెరికాకు చెందిన డెన్నిస్ రిచర్డ్‌స,బ్రిటన్‌కు చెందిన అరుణ షీల్డ్‌స ‘ప్రిన్స్’, మిస్టర్ సింగ్ అండ్ మిసెస్ మెహతా’ చిత్రాలలో ఎంతో బోల్డ్‌గా నటించింది.