సంవత్సరన్నరకాలంగా సినిమా లేకపోయినప్పటికీ ఇలియానా రెమ్యూనరేషన్ ఒకటి నుంచి రెండు కోట్లు పెరిగిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో మిగతా హీరోయిన్లు ఎంత
తీసుకుంటున్నారు? అనేది చర్చనీయాంశమవుతోంది.
తెలుగుతోపాటు, తమిళంలోనూ మార్కెట్ కలిగి, హిందీ ప్రేక్షకులకు కూడా ఓ మోస్తరు పరిచయం కలిగిన త్రిష కోటి రూపాయల లోపు తీసుకుంటుండగా, తెలుగు
తప్ప మరో భాషలో ఏమాత్రం మార్కెట్ లేని ఇలియానాకు ఎందుకంత ఇస్తారు? అనేది ఇక్కడ ప్రశ్న.
పైగా తెలుగు, తమిళ మార్కెట్‌లతో పోల్చితే.. చాలా చిన్న మార్కెట్ కలిగిన కన్నడలోనూ సినిమా చేసి ఉన్న ఇలియానాకు రెండు కోట్లు రెమ్యూనరేషన్ అన్నది
అభూత కల్పనగా పలువురు భావిస్తున్నారు.
అదేవిధంగా.. తమిళంలో త్రిష అంత పాపులర్ కాకపోయినా.. కాజల్ సినిమాలకు కూడా తమిళంలో కొద్దో గొప్పో బిజినెస్ జరుగుతుంటుంది. ఇక ‘మగధీర’
తర్వాత తెలుగులో ఆమె దాదాపుగా నెంబర్ ఒన్ స్థానం చేరుకుంది. మరి ఆమెకు కూడా అంత రెమ్యూనరేషన్ లేదు.
అటువంటిది ‘కిక్’ తర్వాత ‘రెచ్చిపో’, ‘సలీమ్’ అనే మిజరబుల్ ఫ్లాప్స్ ఇచ్చి.. ఆ తర్వాత దాదాపు రెండు సంవత్సరాలుగా గోవాలో గోళ్లు గిల్లుకుంటున్న
ఇలియానాకు అంత సీన్ ఉంటుందా అన్నది ఇక్కడ బిలియన్ డాలర్ ప్రశ్న.
తెలుగుతోపాటు తమిళంలో సమానమైన క్రేజ్ కలిగిన అనుష్కకు కూడా అంత ఇవ్వడం లేదన్నది ఇక్కడ గమనార్హం.
సరే రెమ్యూనరేషన్ గోలను పక్కన పెడితే.. త్రిష నటించిన ‘తీన్‌మార్’, ఇలియానా నటించిన ‘శక్తి’, కాజల్ నటించిన ‘మిస్టర్ పెర్‌ఫెక్ట్’ చిత్రాలు నెల రోజుల
వ్యవధిలో విడుదల కానున్నాయి. మరి ఈ చిత్రాల్లో ఈ భామల అందాలు ఏమేరకు కీలక పాత్ర పోషిస్తాయో వేచి చూడాల్సిందే!