ఇండస్ ఇన్స్పిరేషన్స్ బ్యానర్‌పై నిర్మాత ఎన్.ఏ.కాంతారావు మూడు హాలీవుడ్ చిత్రాల ఆల్ ఇండియా రిలీజ్ హక్కులను సొంతం చేసుకున్నారు. ‘డ్రాకులా-3డి’, ‘బ్యాటిల్‌ఫోర్స్ 3డి’, ఫోర్ట్రెస్ 3డి’ అనే మూడు హాలీవుడ్ సినిమాలు అత్యున్నత సాంకేతిక విలువలతో, అత్యద్భుతమైన గ్రాఫిక్స్‌తో అత్యంత భారీవ్యయంతో రూపొందినవి కావడం విశేషం. ఈ చిత్రాలను త్వరలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నామని నిర్మాత ఎన్.ఏ.కాంతారావు తెలిపారు. ఈ చిత్రాల ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ ‘నిర్మాత కాంతారావు తనకు అత్యంత సన్నిహితుడని...ఈ చిత్రాల ట్రైలర్స్ చూశాక వీటిపై మరింత అంచనాలు పెరిగాయన్నారు.
ప్రపంచమంతా ఇప్పుడు 3డి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ఆ దిశగా పరుగులు తీస్తోందన్నారు. ఒకప్పుడు పాతిక సంవత్సరాల క్రితం ఒకటో అరో 3డి సినిమాలు వచ్చేవి ఇప్పుడు హిందీలో ఏకంగా ఒక అరడజను, తెలుగులో రెండు చిత్రాలు వస్తున్నాయన్నారు. ఈ చిత్రాలు మంచి విజయం సాధిం చి కాంతారావుకి పేరు తేవాలి’ అన్నారు. నిర్మాత కాంతారావు మాట్లాడుతూ ‘పెద్ద మనసుతో తన కార్యక్రమానికి విచ్చేసిన అల్లు అరవింద్‌గారికి కృతజ్ఞతలు తెలుపుతూ...వచ్చే సంవత్సరం 2012 జనవరిలో తమ చిత్రాలను దేశవ్యాప్తంగా విడుదల చేయాలనుకుంటున్నామన్నారు.
|