మసాలా
 
 
 
 
మళ్లీ కొత్తగా 'ఐటం సాంగ్' హవా
మొన్న ‘మున్నీ బద్‌నామ్‌కీహూ’ అంటూ మలెైకా అరోరా చిందులు....నిన్న ‘షీలాకీ జవానీ’ అంటూ కత్రినాకైఫ్‌ షేకులు...కొత్తగా ‘దమ్‌ మారో దమ్‌’ అంటూ దీపిక పదుకునె మెరుపులు. వెరసి బాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఐటం సాంగ్‌ సెగలు కనిపిస్తున్నాయి. పేరున్న బాలీవుడ్‌ హీరోయిన్లంతా ఇప్పుడు తాము సైతం...అన్నట్లుగా ఐటం సాంగ్స్‌ చేసేందుకు తెగ ఉబలాటపడిపోతున్నారు. కరీనాకపూర్‌, బిపాసాబసులు కూడా ఇప్పుడు తమతమ లేటెస్ట్‌ చిత్రాలలో ఐటం సాంగ్స్‌ చేసేందుకు గ్రీన్‌సిగ్నల్‌ చెప్పేశారు.కరీనా తన తాజా చిత్రం ‘రా...వన్‌’లో ఇప్పుడు వస్తున్న లేటెస్ట్‌ ఐటం సాంగ్స్‌కి ధీటుగా జవాబుచెప్పే పాటలో నర్తించనుంది. అలాగే బిపాసాబసు కూడా ‘మర్డర్‌-2’ చిత్రంలో హాట్‌హాట్‌ రొమాంటిక్‌ ఐటం సాంగ్‌ చేయబోతోంది. వీళ్లకు తోడు ‘హిస్‌’ సినిమా తర్వాత అవకాశాలు దాదాపు మూసుకుపోయిన శృంగార తార మల్లికాశరావత్‌ కూడా వరుసపెట్టి ఐటం సాంగ్స్‌ చేసేందుకు ఒప్పందాలు కుదుర్చుకుంటోంది.

ముద్దొచ్చినప్పుడే చంకెక్కాలనే పాలసీ పాటిస్తున్నట్లుంది ఈ హీరోయిన్ల పంథా చూస్తుంటే. ఇప్పుడిప్పుడే ఐటం సాంగ్స్‌ హవా మళ్లీ టాలీవుడ్‌లోనూ ఊపందుకుంటోంది. ఒకప్పుడు జ్యోతిలక్ష్మి, జయమాలిని, అనురాధ, సిల్క్‌స్మితల తర్వాత ముమైత్‌ఖాన్‌, అభినయశ్రీ తదితరులు ఆ లోటు తీర్చుతూ వచ్చారు. అయితే.. టాలీవుడ్‌లోనూ హీరోయిన్సే ఐటం సాంగ్స్‌ చేసేస్తుండడంతో ఐటం గర్ల్‌‌సకు పని లేకుండా పోయింది. అయితే.. లేటెస్ట్‌గా నాగచెైతన్య, తమన్నాలు జంటగా నటిస్తున్న ‘100%లవ్‌’ చిత్రంలో దర్శకుడు సుకుమార్‌ మేఘనానాయుడును ఐటంగాళ్‌గా తీసుకుని ఓ పాట పెట్టినట్లు సమాచారం. మేఘనానాయుడు తెలుగులో ‘విక్రమార్కుడు’ చిత్రంలో చేసింది. గతంలో చాలానే బాలీవుడ్‌ సినిమాలలో ఐటంసాంగ్‌ స్పెషలిస్ట్‌గా చేయడం విశేషం. ఇక ఈ చిత్రం తర్వాత తెలుగులోనూ మరికొన్ని ఐటంసాంగ్స్‌తో ముందుముందు సినిమాలు వచ్చే అవకాశం పుష్కలంగా ఉంది!