Bookmark and Share   Cinevinodam
Subscribe
 
 
జాడెన్‌.. యాక్షన్‌ స్టార్‌ అవుతాడు!

      హాలీవుడ్‌ నటుడు జాకీచాన్‌ గురించి తెలియని వారు ఎవరుంటారు చెప్పండి..? చిన్న పిల్లాడిని అడిగినా ఆయన యాక్షన్‌ను ఒక్కసారైనా గుర్తు చేసుకుంటారు. అంతటి యాక్షన్‌ హీరో ఓ బాల నటుడిని భవిష్యత్తులో గొప్ప యాక్షన్‌ హీరో అవుతాడని చెప్పాడంటే మామూలు విషయమా..? ఇంతకీ ఆ కుర్రాడు ఎవరు..? ఎందుకు అతన్ని జాకీచాన్‌ అంతగా పొగిడాడు..? విషయానికొస్తే.. ఇటీవల ఇంగ్లిష్‌లో 'ది కరాటే కిడ్‌' అనే సినిమా వచ్చింది. అందులో జాకీచాన్‌తోపాటు జాడెన్‌ అనే కుర్రాడు నటించాడు. ఆ అబ్బాయి విల్‌స్మిత్‌ తనయుడు. పదకొండేళ్లకే ఆ అబ్బాయి చేసిన యాక్షన్‌ చూసి జాకీచాన్‌ ఆశర్యపోయాడట. 'రష్‌ అవర్‌' చిత్ర స్టంట్‌ టీమ్‌ నుంచి ఒకరిని ఎంపిక చేసి జాడెన్‌కు మూడు నెలల శిక్షణ ఇప్పించారు విల్‌స్మిత్‌. గత ఏడాది చిత్రీకరణ మొదలుపెట్టడానికి ముందు జరిగిన తంతు ఇది. సినిమా చిత్రీకరణ పూర్తవగానే జాకీచాన్‌ విల్‌ స్మిత్‌తో ఒకటే చెప్పారట.. జాడెన్‌ ప్రతిభను వృథా చెయ్యొద్దు. చాలా బాగా యాక్షన్‌ సన్నివేశాల్లో నటిస్తున్నాడు. ఇక నుంచి ప్రతిరోజూ శిక్షణ ఇప్పించండని! ''ఈ సినిమాలో ఎలాంటి స్పెషల్‌ ఎఫెక్టులు లేవు. పోరాట దృశ్యాలు మొత్తం నిజంగానే చేశాడు. నేను కూడా కొన్ని సన్నివేశాల్లో రెండు టేకులు తీసుకున్నాను. కానీ జాడెన్‌ మాత్రం సింగిల్‌ టేక్‌లో ఒకే చేయడం చూసి ముచ్చటేసింది. వాళ్ల అమ్మను పక్కకు పంపించి మరీ వాళ్ల నాన్న యాక్షన్‌ సన్నివేశాలు చేయించారు. భవిష్యత్తులో గొప్ప యాక్షన్‌ స్టార్‌ అవుతాడ''ని జాకీచాన్‌ వెల్లడించారు.

 
 

Copy right reserved for www.cinevinodam.com 2005