జేమ్స్‌బాండ్ హీరో డానియల్ క్రేగ్ తన గర్ల్‌ఫ్రెండ్ రాచెల్ వెస్ట్‌కు మూడు ముళ్లు వేశారు. ఎవరికీ తెలియకుండా
రహస్యంగా ఆమెను వివాహం చేసు కున్నారు. గత వారం కేవలం నలుగురి ముందు న్యూయార్క్‌లో తన
ప్రియురాలిని ఆయన పెళ్లి చేసుకొని అందర్నీ ఆశ్చర్యపరిచారు.
హాలీవుడ్ హీరో డానియల్ క్రేగ్, రాచెల్ వెస్జ్‌ల మధ్య గత కొంతకాలంగా ప్రేమాయణం కొనసాగుతోంది. చివరికి ఈ
జంట గత వారం మూడు ముళ్లు వేసి ఒకింటి వారయ్యారు. న్యూయార్క్‌లో జరిగిన ఈ వివాహ వేడు కకు
డానియల్ 18 ఏళ్ల కూతురు ఎల్లా, రాచెల్స్ కుమారుడు హెన్రీతో పాటు ఇద్దరు ఫ్యామిలీ ఫ్రెండ్స్ మాత్రమే హాజరు
కావడం విశేషం. డానియల్, రాచె ల్‌లు గత కొంతకాలంగా పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు. కానీ వారికి
సమయం అనుకూలించడం లేదు. చివరికి వారిద్దరు కేవలం నలుగురిని పిలిచి వారి ముందు వివాహం
చేసుకున్నారు. ఒకరినొకరు గాఢంగా ప్రేమిం చుకుంటున్న ఈ జంట వివాహానంతరం ఎంతో సంతోషంగా
కనిపించారు. కానీ గత కొంతకాలంగా ఇద్దరి మధ్య ప్రేమాయణం కొనసాగుతున్నా వారి ద్దరూ పెద్దగా బయటకు
ప్రదర్శించలేదు. గత ఏడాది కొత్త సినిమా ‘ది డ్రీమ్ హౌజ్’ సెట్‌పై మాత్రమే పబ్లిగ్గా కనిపించారు.
|