నితిన్, సదా జంటగా తేజ నిర్మించిన ‘జయం’ ఘన విజయం సాధించింది. ఈ చిత్రం కోసం అప్పట్లో నూతన నటీనటుల ఎంపిక చేశారు. అందులో అల్లు అర్జున్ కూడా పాల్లొన్నారు. అయితే ఎంపిక కాలేకపోయాడు. ఆ అవకాశం నితిన్ కి దక్కింది. ఆ విషయం గురించి ఓ ఇంటర్వ్యూలో బన్నీ తల్లి నిర్మల ఇలా చెప్పారు...
మాది సినిమా కుటుంబం అయినా పిల్లలు కూడా అందులోనే వుండాలని అనుకోలేదు. ఆ విధంగా వారిని ప్రోత్సహించలేదు. ముందు చదువులు... ఆ తర్వాతే మిగతావన్నీ అని అనుకున్నాం. బన్నీ చిన్నతనంలో బొద్దుగా వుండేవాడు. దాంతో మోడలింగ్ లో అవకాశాలొచ్చినా ప్రోత్సహించలేదు. సినిమాల్లోకి రావడం కూడా అనుకోకుండా జరిగిందే. ‘జయం’ కోసం కొత్త హీరోల ఎంపికలో బన్నీ పాల్గొన్నాడు. మొదట అందుకు అంగీకరించినా, మనసులో మాత్రం తనకి ఆ అవకాశం రాదని అనిపించింది. ఆ తర్వాత ఓ రోజు బన్నీ నా దగ్గరికొచ్చిఏదో చెప్పబోయాడు. నువ్వు హీరోగా ఎంపిక కాలేదా? అని నేనే అడిగాను. లేదన్నాడు. ఫర్వాలేదన్నాను. ‘జయం’లో అవకాశం రానందుకు బన్నీ నిరాశపడతాడేమోనని అనుకున్నాను. కానీ, తనేం పట్టించుకోలేదు. అవకాశం రాకపోవడాన్ని సవాలుగా తీసుకున్నాడు. తర్వాత వరుస అవకాశాలు, విజయాలు పొందాడు. ‘గంగోత్రి’లో ‘నువ్వూ నేనూ కలిసుంటేనే’ పాటలో తొలిసారి బన్నీని తెరపై చూశాను. ఈ పాట పూర్తయ్యాక రాఘవేంద్రరావుగారు దాన్ని నాకు పెద్ద తెరపై చూపించారు. అలా వాడిని మొదటిసారి పాటలో చూశాను. ఫరవాలేదు బాగానే చేశాడనిపించింది. నటనలో రాణిస్తాడనిపించింది. అదే నిజమైంది.
|