మసాలా
 
 
 
 
విరగబడి నవ్వడం బలహీనత
నిత్యం వార్తల్లో ఉండే హీరోయిన్లలో జెనీలియూ ఒకరు. చిన్న నవ్వుతోనే యువత మతిపోగెట్టే ఈ ఉత్తరాది భామపై పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. నటిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న ఈ నెరజాణ తమిళం, తెలుగు, మలయాళం, హిందీ అంటూ బహుభాషా నటిగా బిజీగా ఉన్నారు. అలాంటి క్రేజీ నటి వ్యక్తి గత విషయాలను, అభిరుచుల్ని, ఆహారపు అలవాట్లను తెలుసుకోవాలనే కుతూహలం ఉండనివారుండరు. అలాంటి వారి కోసమే ఈ జెనీలియా -10

1. ఈ అందగత్తె ప్రియ స్నేహితురాలు నయనతార. వీరు తరచూ కలుసుకుంటారు. జెనీలియా ఖాళీ సమయాల్లో తన పాఠశాల స్నేహితులతో కలిసి విహార యాత్రలు చేస్తారు.

2.ఈమెకు నచ్చిన డ్రస్ టి.షర్టు. చీర కట్టుకోవడం అరుదే. ఏదైనా ఫంక్షన్‌కు వెళ్లేటప్పుడు మాత్రం అట్రాక్షన్‌గా ఉండే మోడ్రన్ డ్రస్ ధరిస్తారు.

3.కుక్క పిల్లలంటే చాలా ఇష్టం. తన పెట్ డాగ్‌కు సిలో అని పేరు పెట్టుకున్నారు.

4.ఆమె కురులంటే ఎంతో ఇష్టం. తరచూ హేర్ స్టైల్‌ను మార్చుతూ ఆనందపడతారు.

5. నాలుగేళ్లుగా 53 కిలో బరువునే మెయిన్‌టెయిన్ చేస్తున్నారు. ఆహార విషయూల్లో ఈ అమ్మడు చాలా డైట్.

6.తన కారు డ్రైవర్ నుంచి సహ నటీనటులతో జోక్స్ చెప్పించుకుంటూ విరగబడి నవ్వడం బలహీనత.

7.పార్టీలకు, పబ్, హబ్‌లకు వెళ్తుంటారు. స్నేహితులతో ఎక్కువగా గడపడం ఇష్టం.

8.బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌పాండేతో నాలుగేళ్లుగా ప్రేమాయణం సాగిస్తున్నారు. అయితే తమ మధ్య ఉన్నది స్నేహమే అంటారు.

9.ఈమె క్రిస్టియన్. షూటింగ్ లేకపోతే ప్రతి ఆదివారం చర్చ్‌కు వెళతారు.

10. షూటింగ్ స్పాట్‌లో ఏ కొంచెం గ్యాప్ వచ్చినా ల్యాప్‌టాప్‌తో మాట్లాడుతుంటారు. ట్విట్టర్‌లో జెనీలియాను సుమారు రెండు లక్షల మంది అభిమానులు పలకరిస్తారట. వారిలో నటుడు పృథ్వీరాజ్ కూడా ఉన్నారట.