మసాలా
 
 
 
 
కలిసొస్తే అంతా మంచే జరుగుతున్దంటున్న జెన్నిఫర్‌
పాప్‌ క్వీన్‌, హాలీవుడ్‌ తార జెన్నిఫర్‌ లోపెజ్‌ తన 42వ జన్మదిన వేడుకలను లాస్‌ఏంజిల్స్‌ మియామిలో ఘనంగా జరుపుకున్నారు. ఇటీవల తన భర్త మార్క్‌ ఆంథోని నుంచి విడిపోయినప్పటికీ దాన్ని మరచిపోయి తన పుట్టినరోజును ఆమె ఆడంబరంగా నిర్వహించారు. ఈ వేడుకలకు పలువురు సెలబ్రిటీలు హాజరై హాయిగా ఎంజాయ్‌చేశారు.

కొద్ది రోజుల క్రితం జెన్నిఫర్‌ లోపెజ్‌ ఏడు సంవత్సరాల పాటు కాపురం చేసిన భర్త మార్క్‌ ఆంథోనీ నుంచి విడిపోయారు. వీరిద్దరికి మ్యాక్స్‌, ఎమ్మె అనే కవలలు పుట్టారు. కానీ భర్త నుంచి విడిపోయినా ఆ బాధ నుంచి పూర్తిగా బయటపడి మియామి హోటల్‌లో తన స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్య పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకలో జెన్నిఫర్‌ అందమైన ఈవినింగ్‌ డ్రెస్సులో మురిపించారు. అందరి కరతాళ ధ్వనుల మధ్య బర్త్‌డే కేక్‌ను కట్‌చేశారు.

ఆ తర్వాత ఆమె చక్కగా పాడి అలరించారు. బర్త్‌డే సందర్భంగా ఆమె ఎంతో సంతోషంగా కనిపించారు. పలువురు స్నేహితులతో నైట్‌పార్టీని ఎంజాయ్‌ చేశారు. తనకిష్టమైన ఫుడ్‌ ఐటమ్స్‌ను ఆస్వాదించారు. క్రిస్టల్‌ గోబ్లెట్‌ శాంపేన్‌ను సన్నిహితులతో కలిసి సేవించారు. పార్టీ అనంతరం అందరూ కలిసి డిన్నర్‌ చేసి వేడులను ఆనందంగా ముగించారు. ‘జీవితంలో అనుకోని సంఘటనలు ఎన్నో జరుగుతుంటాయి. ఇటువంటిదే భర్త మార్క్‌తో విడిపోవడం. కొద్ది రోజుల పాటు నేను ఎంతో బాధపడ్డాను. కానీ పరిస్థితుల కారణంగా ఇది జరిగింది. కాలం కలిసి వస్తే భవిష్యత్తులో అంతా మంచే జరుగుతుంది. జరిగిన దానికి బాధపడాల్సిందేమీ లేదు. ఈ నేపథ్యంలో వచ్చిన నా బర్త్‌డేను ఎంతో గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేశాను. స్నేహితులతో కలిసి హాయిగా షాంపేన్‌ తాగి డిన్నర్‌ చేశాను’అని జెన్నిఫర్‌ పేర్కొన్నారు.