ప్రముఖ పాప్ సింగర్, హాలీవుడ్ తార, మోడల్ అయిన జెన్నిఫర్ లోపెజ్ గురించి తెలియని మ్యూజిక్ లవర్స్ వారుండరు. ఈ గాయని 13 సంవత్సరాల టీనేజీ వయసులోనే ప్రేమలో
పడిందట. ఈ నేపథ్యంలో 41 సంవత్సరాల ఈ అమ్మడు ప్రస్తుతం ‘లవ్..?’పేరిట ఓ కొత్త మ్యూజిక్ ఆల్బమ్‌ను విడుదల చేశారు. టీనేజీలోనే మొదటిసారిగా ప్రేమానుభూతిని పొందిన ఈ
సెలబ్రిటీ తన కొత్త ఆల్బమ్ యువ హృదయాలను గిలిగింతలు పెడుతుందని చెప్పడం విశేషం.
తన కొత్త ఆల్బమ్ లవ్..!లోని పలు పాటలు యువతీయువకులకు ఎంతో నచ్చుతాయని చెబుతున్నారు అందాలభామ జెన్నిఫర్ లోపెజ్. ప్రేమ గురించి ఆమె మాట్లాడుతూ నేటి రోజుల్లో
నిజమైన ‘ప్రేమ’ కనిపించ కుండా పోయిందని వాపోయారు. ఇక తన కొత్త లవ్ సాంగ్స్ ఇప్పటికే ఇండియాలో పాపులర్ అయ్యాయనీ తన అభిమానులు వీటిని ఎంతో ఇష్టంగా వింటు న్నారని
చెప్పారు. ‘నా కొత్త ఆల్బమ్‌లోని పాటలు ప్రేమలోని విభిన్న కోణాల ను స్పృశించాయి.
నేటి ప్రపంచంలో ఏ జీవి కూడా ప్రేమ లేకుండా జీవించ లేదు. కానీ నేడు నిజమైన ప్రేమ కనిపించకుండా పోయింది’ అని జెన్నిఫర్ అన్నారు. ‘నా ఆల్బమ్‌లోని వాట్ ఈజ్ లవ్..?
అనే పాట ప్రేమాను భూతిని కలిగిస్తుంది. ఆల్బమ్‌లోని స్టార్టింగ్ ఓవర్..పాట ప్రేమ మూలంగా ఏర్పడిన అనుబంధాన్ని తెలియజేస్తుంది.ప్రేమ అనేది విభిన్నమైన అనుభూతిని కలి గిస్తుంది.
టీనేజీ వయసులోని ప్రేమ ఎవరికైనా జీవితాంతం గుర్తుండి పో తుంది’ అని వివరించారు. ‘నా భర్త మార్క్ ఆంథొనీ మొదట నా కొత్త ఆల్బమ్ పేరును చూసి సరిగా లేదన్నాడు. కానీ అతనికి
ఇందులోని సాంగ్స్ గురించి వివరించగానే సంతృప్తిచెందాడు.
అనంతరం ఆయన ఈ ఆల్బమ్ రూపుదిద్దుకునే సమయంలో తన పూర్తి సహాయ, సహకారాలను అందించాడు. అద్భుతమైన గొంతు నాది అని చెప్పే మార్క్ ఆల్బమ్ రికార్డింగ్ సమ
యంలో నా వెంటే ఉన్నాడు.ఇది నా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది’ అని జెఎల్ పేర్కొన్నారు. ఇక తన అందచందాలు, గ్లామర్ గురించి జెన్నిఫర్ వివరిస్తూ ‘నా అందం, గ్లామర్ ఇవంతా
దేవుడిచ్చిన వరంగా భావిస్తాను. కానీ వీటిని నిలబెట్టుకునేందుకు ప్రతిరోజు సుఖంగా నిద్రపోతాను. దీంతో పాటు మంచి నీళ్లు ఎక్కువగా తాగుతాను.ఇవే నా గ్లామర్ సీక్రెట్’ అని ఆమె
చెప్పారు.